Abhishek Bachchan: ఐశ్వర్యతో విడాకులా..రెండో పెళ్లి ఎప్పుడు?.. అభిషేక్ ట్వీట్ వైరల్

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ గతంలో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. 2014లో ఐశ్యర్యరాయ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు రావడంతో అప్పట్లో అభిషేక్ ఆసక్తికర ట్వీట్ చేశారు. వాటిపై స్పందిస్తూ 'నేను విడాకులు తీసుకుంటానని నమ్ముతున్నా. ఈ విషయం నాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. రెండో పెళ్లి విషయం కూడా మీరే చెప్పండి. థ్యాంక్స్ అంటూ ట్విటర్‌లో అభిషేక్ రాసుకొచ్చారు.
(చదవండి: పొన్నియన్ సెల్వన్: అమ్మకానికి ఐశ్వర్య రాయ్, త్రిషల నగలు)
కాగా... అభిషేక్, ఐశ్వర్యరాయ్ జంట 20 ఏప్రిల్ 2007లో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన నాలుగేళ్లకు అమ్మాయి పుట్టగా ఆరాధ్య అని పేరు పెట్టారు. అప్పట్లో 2014లో ఇద్దరూ విడిపోవాలనుకున్నట్లు రూమర్లు పెద్దఎత్తున వ్యాపించాయి. గతంలో ఈ బాలీవుడ్ జంటపై వచ్చిన వార్తలపై ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ ప్రస్తావించారు. అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. 'ఐశ్వర్యతో నా జీవితాన్ని ఎలా నడిపించాలో నిర్దేశించడానికి మూడో వ్యక్తి చెప్పేందుకు అంగీకరించను. నేను ఎంతగా ప్రేమిస్తున్నానో ఆమెకు తెలుసు.. ఆమె నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు.' అని అన్నారు.
Ok…. So I believe I’m getting divorced. Thanks for letting me know! Will you let me know when I’m getting re-married too? Thanks. #muppets
— Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) May 16, 2014
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు