బిగ్‌ బాస్‌ OTT: బర్రెలక్కతో పాటు సీజన్‌-7 నుంచి ఆ ఇద్దరికీ ఛాన్స్‌ | Sakshi
Sakshi News home page

బిగ్‌ బాస్‌ OTT: బర్రెలక్కతో పాటు సీజన్‌-7 నుంచి ఆ ఇద్దరికీ ఛాన్స్‌

Published Thu, Dec 28 2023 5:18 PM

Bigg Boss Telugu OTT Season 2 Plan Details - Sakshi

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 7 సూపర్‌ హిట్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో భారీగానే వార్తలు వచ్చాయి. బిగ్‌ బాస్‌-7 విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌ నిలవడం... ఫైనల్‌ రోజున అన్నపూర్ణ స్టూడియో​ వద్ద జరిగిన గొడవల వల్ల ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం.. చివరకు రెండు రోజుల పాటు ఆయన చంచల్‌గూడ జైలుకు కూడా వెళ్లడం వంటి సంఘటనలతో ఇప్పటికీ కూడా బిగ్‌ బాస్‌ సీజన్‌-7 టాపిక్‌ సోషల్‌ మీడియాలో నడుస్తూనే ఉంది.

(ఇదీ చదవండి: రూ.500కోట్ల క్లబ్​లో సలార్‌.. మరో వంద కోట్లు వస్తే)

ఈ సీజన్‌ హిట్‌ కావడంతో బిగ్‌ బాస్‌ OTT -2 కోసం నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నారట. గతేడాది ఫిబ్రవరిలో ‘బిగ్‌బాస్‌ నాన్‌- స్టాప్‌ పేరుతో హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారం అయింది. 24/7 వినోదం పంచేందుకు 2022లో మొదటిసారి ఓటీటీలోకి కూడా వచ్చేశాడు బిగ్‌ బాస్‌. అప్పుడు కూడా ఈ షో పట్ల మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. గతంలో మాదిరే ఈసారి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా వ్యహరిస్తున్నట్లు సమాచారం. బిగ్‌ బాస్‌ OTT సీజన్‌-1 విజేతగా తెలుగు హీరోయిన్‌ బిందు మాధవి నిలిచింది. బిగ్ బాస్ OTTలో ఒక ప్రత్యేకత ఉంది ఇందులో కొత్త, పాత కంటెస్టెంట్లు కూడా ఉంటారు. అంటే బుల్లితెర బిగ్‌ బాస్‌లో కనిపించిన  కొంతమంది OTTలో కూడా పాల్గొంటారు.

SPY బ్యాచ్‌ వర్గం నుంచి ఆ ఇద్దరికి ఛాన్స్‌
బిగ్‌ బాస్‌ సీజన్‌-7లో బాగా పాపులర్‌ అయిన కొంతమందిని ఓటీటీ కోసం తీసుకుంటున్నట్లు సమాచారం. SPY బ్యాచ్‌కు మద్ధతుగా నిలిచిన భోలే షావళి, నయని పావణిని బిగ్‌ బాస్‌ ఓటీటీ సీజన్‌-2 కోసం తీసుకోబోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ కూడా ఈసారి బిగ్‌ బాస్‌లో మంచి ఇంపాక్ట్‌ చూపారు. తాజాగా పల్లవి ప్రశాంత్‌కు బెయిల్‌ కోసం భోలే ఎక్కువగా చొరవ చూపారు. దీంతో ఆయనకు షోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. దీనిని బిగ్‌ బాస్‌ టీమ్‌ ఓటీటీ కోసం క్యాష్‌ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు టాక్‌.

బర్రెలక్కతో పాటు పార్వతి కూడా అవకాశం
బిగ్‌ బాస్‌ ఓటీటీలోకి కర్నె శిరీష (బర్రెలక్క) కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్‌ మీడియాలో ఆమెకు ఫ్యాన్‌బేస్‌ ఎక్కువగా ఉంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో  నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆమె పోటీ చేసింది. సుమారుగా 6 వేల ఓట్లు సాధించి మరింత పాపులర్‌ అయింది. ముఖ్యంగా జనసేన అభ్యర్థుల కంటే ఆమెకే ఎక్కువగా ఓట్లు రావడంతో ఆమె పేరును పెద్దపెద్ద రాజకీయ నాయకులే బహిరంగంగా పలికారు. దీంతో ఆమె పేరు రెండు రాష్ట్రాల్లో ట్రెండింగ్‌ అయిపోయింది. ఈ ఇమేజ్‌ను బిగ్‌ బాస్‌ టీమ్‌ క్యాష్‌ చేసుకునేందుకు ప్లాన్‌ వేసినట్లు సమాచారం.

బగ్‌ బాస్‌ ఓటీటీ కోసం ఆమెను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు జీ తెలుగులో వచ్చిన 'సరిగమప' షో ద్వారా  సింగర్‌గా పరిచయమైన పార్వతిని కూడా బిగ్‌ బాస్‌ వారు కలిశారట. యూట్యూబ్‌లో నవాబ్‌ కిచెన్‌ పేరుతో  మోయిన్ భాయ్ చాలా పాపులర్‌ అయ్యాడు. ఆయన్ను కూడా బిగ్‌ బాస్‌ టీమ్‌ అప్రోచ్‌ అయిందని సమాచారం. వీరితో పాటు సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయిన వారిని బిగ్‌ బాస్‌ టీమ్‌ కలుస్తున్నట్లు సమాచారం.  2024 ఫిబ్రవరిలో బిగ్‌ బాస్‌ ఓటీటీ సీజన్‌-2 ప్రారంభం కానుందని టాక్‌ ఉంది. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement