రూ.500కోట్ల క్లబ్​లో సలార్‌.. మరో వంద కోట్లు వస్తే | Sakshi
Sakshi News home page

రూ.500కోట్ల క్లబ్​లో సలార్‌.. మరో వంద కోట్లు వస్తే

Published Thu, Dec 28 2023 3:07 PM

Salaar Movie In The Rs 500 Crore Club - Sakshi

ప్రభాస్ నటించిన సలార్ కలెక్షన్స్‌ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ నెల 22న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్‌లో షారుక్‌ ఖాన్‌ డంకీ చిత్రాన్ని తట్టుకుని అక్కడ కూడా భారీగానే కలెక్షన్స్‌ రాబడుతుంది. సినిమా విడుదలయ్యి ఇప్పటికి మొదటి వారం పూర్తి కాకుండానే రూ.500 కోట్ల మార్క్​ను సలార్‌ అందుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్‌ తెలిపింది. త్వరలోనే సలార్‌ రూ.1000 కోట్ల టార్గెట్‌ను కూడా రీచ్‌ అవుతుందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరో వంద కోట్లు వస్తే సేఫ్‌ మార్క్‌
ప్రపంచవ్యాప్తంగా సలార్‌ బిజినెస్​ కూడా ఒక రేంజ్​లో జరిగింది. 'బాహుబలి'ని మించి కొన్ని ఏరియాల్లో టికెట్​ రేట్లు ఉండటం విశేషం. వరల్డ్ వైడ్​గా ఈ సినిమాకు రూ. 400 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అంటే టార్గెట్​ను అందుకోవాలంటే సలార్​ ఫుల్​ రన్​లో రూ. 600 కోట్ల మేర గ్రాస్​ కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉందని సమాచారం. ఇప్పటికే సలార్‌ ఖాతాలో రూ. 500 కోట్లు వచ్చేశాయి. మరో రూ. 100 కోట్లు సలార్‌కు వస్తే  బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే అని ట్రేడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి.

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్- ప్రశాంత్ నీల్ డైరెక్షన్​లో తెరకెక్కిన చిత్రం సలార్‌.. రెండు పార్టులుగా రానున్న ఈ చిత్రం డిసెంబర్ 22న మొదటి భాగం విడుదలైంది. ఈ మూవీలో ప్రభాస్ మాస్ యాక్షన్ సీన్స్‌తో పాటు భారీ ఎలివేషన్స్‌ అభిమానులను మెప్పిస్తున్నాయి. దీని కోసం ఫ్యాన్స్ రిపీట్ మోడ్​తో థియేటర్లకు వెళ్తున్నారు.

Advertisement
 
Advertisement