నాన్న కొట్టాడు, సినిమాలు లేక నాలుగేళ్లు ఖాళీగా ఉన్నా: షకీల | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: దుస్తులు విప్పేయమంటున్నారంటే కూడా నాన్న పట్టించుకోలేదు.. షకీల

Published Sun, Sep 3 2023 8:33 PM

Bigg Boss Telugu 7: Shakeela Entered as 6th Contestant - Sakshi

బోల్డ్‌ క్యారెక్టర్లకు పెట్టింది పేరు షకీల. వెండితెరపై బోల్డ్‌గా కనిపించే ఆమె నిజ జీవితంలోనూ అలాగే ఉంటారనుకుంటే పొరపాటే! రియల్‌ లైఫ్‌లో చాలా సాఫ్ట్‌గా కనిపించే ఆమె 18 ఏళ్లకే నటించడం మొదలుపెట్టింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించింది. షకీలా తల్లిది నెల్లూరు, తండ్రిది చెన్నై. తన ఫ్యామిలీ గురించి షకీల మాట్లాడుతూ.. 10వ తరగతి ఫెయిల్‌ కావడంతో తండ్రి చితకబాదాడు. ఆయన మేకప్‌మెన్‌ నన్ను సినిమాల్లో చేర్పిస్తానన్నాడు. అలా ఒకరోజు నేను సిల్క్‌ స్మితను చూశాను. నన్ను సిల్క్‌ స్మిత చెల్లెలిగా సెలక్ట్‌ చేశారు.

చాలా సినిమాల్లో నన్ను దుస్తులు విప్పేయమంటున్నారు నాన్న అని చెప్తే.. చేయనని చెప్పేయ్‌ అని సులువుగా అనేవారు. నాన్న చనిపోయాక హాట్‌ రోల్స్‌ చేశాను. నా డబ్బులన్నీ మా అక్క చూసుకునేది. తను బాగుపడింది. నా సినిమాకు సెన్సార్‌ ఇవ్వకుండా ఆపేశారు. నాలుగేళ్లు ఖాళీగా ఉన్నాను. నేను నేనుగా ఉండటమే నా బలం' అని చెప్పుకొచ్చింది. షకీల 50 మందికి పైగా ట్రాన్స్‌జెండర్ల బాగోగులు చూసుకుంటోంది. వారిలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు స్టేజీపైకి వచ్చి షకీల గురించి చెప్తూ ఎమోషనలయ్యారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement