Bigg Boss Telugu 6: RJ Surya Says Inaya Sultana is a Top 5 Contestant - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: నువ్వు టాప్‌ 5లో ఉండాలి.. నీ గేమ్‌ కూడా కలిపి ఆడతా

Oct 30 2022 3:28 PM | Updated on Oct 30 2022 4:38 PM

Bigg Boss Telugu 6: RJ Surya Says Inaya sultana is a Top 5 Contestant - Sakshi

సూర్య కనిపించడంతో తెగ ఎమోషనలైపోయింది ఇనయ. కొరియన్‌లా చేతివేళ్లతో లవ్‌ సింబల్‌ను చూపించింది. సూర్య కూడా అదే విధంగా సింబల్‌ చూపించాడు.

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో ఈవారం డైరెక్ట్‌ ఎలిమినేషన్‌ జరిగింది. సండే కంటే ఒక రోజు ముందే సూర్య ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు. స్టేజీపైకి వచ్చాక అతడు ఏమేం మాట్లాడాడో ప్రోమోలు వదులుతోంది బిగ్‌బాస్‌ టీమ్‌. ఓ వీడియోలో సూర్య.. నీ గేమ్‌ నువ్వు ఆడితే అసలు నీకు కాంపిటీషనే లేదని గీతూను ఆకాశానికెత్తాడు. అలాగే ఇనయ టాప్‌ 5లో ఉండాలని కోరుకుంటున్నానన్నాడు. అయితే సూర్య కనిపించడంతో తెగ ఎమోషనలైపోయింది ఇనయ. కొరియన్‌లా చేతివేళ్లతో లవ్‌ సింబల్‌ను చూపించింది. సూర్య కూడా అదే విధంగా సింబల్‌ చూపించాడు. దీంతో నాగ్‌.. ఇవన్నీ ఏంటసలు? నాకర్థం కావడం లేదని జుట్టు పీక్కున్నాడు. 

ఇక ఈరోజు ఎపిసోడ్‌లో లైక్‌ షేర్‌ సబ్‌స్క్రైబ్‌ మూవీ హీరోహీరోయిన్లు సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా స్పెషల్‌ గెస్టులుగా వచ్చేసి సందడి చేయబోతున్నారు. హౌస్‌మేట్స్‌తో పీపీతో పాట గేమ్‌ ఆడించారు. మరి ఆ ఆటలు, పాటలు చూడాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేదాకా ఆగాల్సిందే!

చదవండి: చివరిసారిగా సూర్యకు ఇనయ ముద్దుల వర్షం
గీతూను ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు

Advertisement
 
Advertisement
Advertisement