Bigg Boss 6 Telugu: Geetu Royal Eliminated From BB6 House, Deets Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: రోత పుట్టించిన గీతక్క ఎలిమినేట్‌!

Nov 5 2022 3:35 PM | Updated on Nov 6 2022 10:33 PM

Bigg Boss Telugu 6: Geetu Royal Eliminated From BB House - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో మరో షాకింగ్‌ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. టాప్‌ 5లో ఉంటాడనుకున్న సూర్య గతవారమే ఎలిమినేట్‌ కాగా ఏకంగా విన్నర్‌ అయిపోతానని ఊహల్లో తేలిపోయిన గీతూ రాయల్‌ అనూహ్యంగా ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది. ఈసారి బిగ్‌బాస్‌ కొట్టిన దెబ్బకు కంటెస్టెంట్లు నోరెళ్లబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

నిజానికి గీతూ తన గేమ్‌ను చేజేతులా నాశనం చేసుకుంది. మొదట్లో గీతూ వల్లే ఈ సీజన్‌ అంతో ఇంతో ఇంట్రస్ట్‌గా మారింది. ఆమెపైనే ఎక్కువగా ప్రోమోలు వచ్చేవి. నాగార్జున కూడా గీతూ గేమ్‌ను మెచ్చుకునేవాడు. కానీ ఆ విజయాన్ని నెత్తికెక్కించుకుంది రాయలక్క. కంటెస్టెంట్లే కాదు, బిగ్‌బాస్‌ చెప్పినా వినేదే లేదంటూ తనకు నచ్చినట్లు అడ్డదిడ్డంగా గేమ్‌ ఆడటం మొదలుపెట్టింది. బుద్ధిబలం వాడుతున్నానంటూ పదేపదే తనను నమ్మిన వారి ఎమోషన్స్‌ను దెబ్బతీసింది.

గేమ్‌లోనూ కొత్త కొత్త రూల్స్‌ పెడుతూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది. ఆమె ప్రవర్తన అటు ప్రేక్షకులకే కాదు బిగ్‌బాస్‌కి కూడా కోపం తెప్పించింది. దీంతో నాగ్‌.. నీ గేమ్‌ బొచ్చులో ఆటలా ఉందని చీదరించుకున్నాడు, పద్ధతి మార్చుకోమని సూచించాడు. అయినా తన తీరు మార్చుకోని గీతూ ఈవారం మరింత రెచ్చిపోయింది. తనను నమ్మిన ఏకైక వ్యక్తి ఆదిరెడ్డిని కూడా వెన్నుపోటు పొడిచింది. ఆమె స్ట్రాటజీలు, లూపులు వెతుక్కుని గేమ్‌ ఆడటాలు చూసి జనాలకు విసుగుపుట్టింది. ఫలితంగా ఆమెను ఈ వారం ఇంటి నుంచి బయటకు పంపిచేశారు.

చదవండి: ఇనయపై పగపట్టిన రేవంత్‌, ఈ వీడియోనే సాక్ష్యం

Advertisement
 
Advertisement
Advertisement