బిగ్‌బాస్‌ ట్విస్టులు.. అప్పుడే ఏడిపించి, ఆ వెంటనే.. | Bigg Boss Telugu 6: Bigg Twists and Surprises In Battery Recharge Task | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: హౌస్‌మేట్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన బిగ్‌బాస్‌

Published Tue, Oct 11 2022 7:33 PM | Last Updated on Tue, Oct 11 2022 7:33 PM

Bigg Boss Telugu 6: Bigg Twists and Surprises In Battery Recharge Task - Sakshi

నామినేషన్స్‌తో ఫైర్‌ మీదున్న కంటెస్టెంట్లను బిగ్‌బాస్‌ కూల్‌ చేసినట్లు తెలుస్తోంది. బ్యాటరీ రీచార్జ్‌ టాస్క్‌తో వారిని ఏడిపించి చివర్లో మాత్రం నవ్వించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఇందులో సుదీప, ఆదిరెడ్డిలకు తమ ఇంటిసభ్యుల నుంచి ఆడియో కాల్‌ కావాలా? వీడియో కాల్‌ కావాలా? ఫుడ్‌ కావాలా? అని అడిగాడు.

వారు ఎంచుకునే ఆప్షన్‌ను బట్టి బ్యాటరీలు డౌన్‌ అవుతాయని చెప్పాడు. దీంతో వారు ఏది సెలక్ట్‌ చేసుకోవాలో అర్థం కాక ఎమోషనలయ్యారు. అయితే సుదీప తన ఫ్యామిలీతో ఫోన్‌ కాల్‌ మాట్లాడినట్లు కనిపిస్తోంది. మరి మిగతావారికి ఆడియో కాలా? వీడియో కాలా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి నేటి ఎపిసోడ్‌ బోలెడన్ని ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లతో రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది.

చదవండి: బిగ్‌బాస్‌ వార్నింగ్‌, ఏడ్చేసిన శ్రీహాన్‌
ఒకే ఒక జీవితం ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement