Bigg Boss 6 Telugu: Adi Reddy Video Call With Wife, Shrihan Gets Mutton Biryani | Bigg Boss 6 Telugu Episode 38 Highlights - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: ఘోరమైన బూతు, అదేంటో తెలిస్తే ఇనయ చెప్పుతో కొడుతుంది!

Oct 11 2022 11:39 PM | Updated on Oct 13 2022 8:20 PM

Bigg Boss Telugu 6: Adi Reddy Video Call With Wife, Shrihan Gets Mutton Biryani - Sakshi

నీ భర్తతో మాట్లాడతావా? టీషర్ట్‌ కావాలా? మీ అమ్మ చేసిన చికెన్‌ కర్రీ కావాలా? అని అడిగాడు. అందుకామె కన్నీరుమున్నీరుగా

Bigg Boss Telugu 6, Episode 38: బిగ్‌బాస్‌ షో ఆరో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్‌ కొన్ని సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేశాడు. ఆడియో కాల్‌, వీడియో కాల్‌, ఇంటి నుంచి ఫుడ్‌ అంటూ వారిని సర్‌ప్రైజ్‌ చేశాడు. అయితే ఇక్కడే ఏదో మెలిక కూడా పెట్టాడు. మరి ఆ సర్‌ప్రైజ్‌లు ఎవరెవరికి దక్కాయో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయాల్సిందే!

నామినేషన్స్‌ ముగిసినా దాన్నుంచి బయటపడలేకపోయింది కీర్తి. 'ఇనయను నీ ఎంకమ్మ అనడం పెద్ద బూతు అని శ్రీసత్య అందరి ముందు నొక్కి చెప్పింది. కానీ అదే శ్రీసత్య ఇనయను ఘోరమైన బూతులు అంది. అదేంటో చెప్తే ఇనయ ఆమెను చెప్పు తీసుకుని కొట్టడం ఖాయం. ఆమె ఏమందో చెప్తే హౌస్‌ అల్లకల్లోలం అయిపోతుంది' అని ఫైమాతో చెప్పుకొచ్చింది కీర్తి. మరుసటి రోజు బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు బ్యాటరీ రీచార్జ్‌ టాస్క్‌ ఇచ్చాడు. అందులో భాగంగా గార్డెన్‌ ఏరియాలో 100% చార్జ్‌ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ వారం హౌస్‌మేట్స్‌ కోసం బిగ్‌బాస్‌ కొన్ని సర్‌ప్రైజ్‌లను ప్లాన్‌ చేశాడు. అయితే ఇంటిసభ్యులు ఎంచుకునే ప్రతి సర్‌ప్రైజ్‌కు బదులుగా బ్యాటరీలోని కొంత చార్జ్‌ తగ్గిపోతుంది. అంతేకాక ఇంటి నియమాలను ఉల్లంఘిస్తే కూడా చార్జ్‌ తగ్గిపోతుందని చెప్పాడు బిగ్‌బాస్‌.

ముందుగా శ్రీహాన్‌ను పిలిచి నాన్నతో వీడియో కాల్‌ మాట్లాడటానికి 58%, సిరితో ఆడియో కాల్‌కు 30%, ఇంటి నుంచి మటన్‌ బిర్యానీ కావాలంటే 15% బ్యాటరీ ఉపయోగించాలని బిగ్‌బాస్‌ తెలిపాడు. మొదట ఇవేవీ తనకు వద్దనుకున్నాడు, కానీ బిగ్‌బాస్‌ ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిందేనని హెచ్చరించడంతో మటన్‌ బిర్యానీ కావాలని చెప్పాడు.

తర్వాత సుదీపను పిలిచి నీ భర్తతో మాట్లాడతావా? టీషర్ట్‌ కావాలా? మీ అమ్మ చేసిన చికెన్‌ కర్రీ కావాలా? అని అడిగాడు. అందుకామె కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఉన్నదాంట్లో తక్కువ బ్యాటరీ ఉన్న ఆడియో కాల్‌(30%)ను ఎంచుకుంది. దీంతో ఆమె తన భర్త రంగనాథ్‌తో తనివితీరా మాట్లాడింది. అటు శ్రీహాన్‌ తన మటన్‌ బిర్యానీని గీతూతో షేర్‌ చేసుకున్నాడు.

రేవంత్‌ పడుకోవడంతో 5% , గీతూ సరిగా మైక్‌ ధరించకపోవడంతో మరో 5% తగ్గిపోయింది. తర్వాత ఆదిరెడ్డి అందరి గురించి ఆలోచించను, ఇప్పుడు తనకు ఫ్యామిలీనే ముఖ్యం అనుకున్నాడు. ఎక్కువ బ్యాటరీ కట్‌ అయ్యే ఫ్యామిలీతో వీడియో కాల్‌(40%)ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకున్నాడు. దీంతో అతడు తన భార్యాకూతురితో వీడియో కాల్‌ మాట్లాడగా... ఈ సంతోషంతో ఆదిరెడ్డికి రాత్రి నిద్ర కూడా పట్టినట్లు లేదు.

చదవండి: వాళ్లు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎందుకుంటున్నారో తెలీట్లేదు
స్టేజ్‌పై ఏడ్చేసిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement