Bigg Boss 5 Telugu: అతడికే కండలున్నాయా?: యాంకర్‌ రవిపై మాస్టర్‌ ఫైర్‌ - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: విశ్వ దూకుడును జీర్ణించుకోలేకపోయిన మాస్టర్‌!

Sep 10 2021 4:34 PM | Updated on Sep 11 2021 11:41 AM

Bigg Boss Telugu 5: Natraj Master Furious On Anchor Ravi - Sakshi

నటరాజ్‌ మాస్టర్‌, లోబో సహా పలువురు కంటతడి పెట్టుకోగా... సడన్‌గా ఇల్లు ఇల్లులా లేనట్లు అనిపించిందని షణ్ముఖ్‌ అభిప్రాయపడ్డాడు....

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో వినాయక చవితి వేడుకలు షురూ అయ్యాయి. ఇంటిసభ్యులు మట్టి గణపతిని తయారు చేసి, అనంతరం బొజ్జ గణపయ్యను ప్రతిష్టించి పూజలు చేశారు. ఈ క్రమంలో తమతమ ఫ్యామిలీ మెంబర్స్‌ను గుర్తు చేసుకుని కంటెస్టెంట్లు ఎమోషనల్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కుటుంబ సభ్యులు లేకుండానే వేడుకలు జరుపుకుంటున్నందుకు చింతించినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా రిలీజైన ప్రోమోలో నటరాజ్‌ మాస్టర్‌, లోబో సహా పలువురు కంటతడి పెట్టుకోగా... సడన్‌గా ఇల్లు ఇల్లులా లేనట్లు అనిపించిందని షణ్ముఖ్‌ అభిప్రాయపడ్డాడు.

మరోవైపు హౌస్‌మేట్స్‌ ఇంటి సరుకులు అందుకునేందుకు బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ ఇచ్చాడు. కళ్లకు గంతలు కట్టుకుని సరుకులు రాసి ఉన్న కుండలు పగల కొట్టమని ఆదేశించినట్లున్నాడు. దీంతో సింగర్‌ శ్రీరామచంద్ర.. విశ్వను ఎత్తుకుని ఉట్టికొట్టేందుకు సహాయపడ్డాడు. ఈ టాస్క్‌లో విశ్వ తన విశ్వరూపం చూపించినట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్లు కూడా అతడిని బాగానే ఎంకరేజ్‌ చేశారు.

అయితే నటరాజ్‌ మాస్టర్‌ మాత్రం ఈ టాస్క్‌లో కొంత నిరుత్సాహపడ్డట్లు కనిపిస్తోంది. 'విశ్వ ఒక్కడికే కండలున్నాయా? అతడు మాత్రమే ఈ టాస్క్‌ చేయగలుగుతాడా? విశ్వ మాత్రమే కాదు, ఇంకో ఇద్దరినైనా నేను లేపుతాను' అని యాంకర్‌ రవి మీద ఫైర్‌ అయ్యాడు మాస్టర్‌. మరి వీరిద్దరి మధ్య గొడవ సమసిపోయిందా? లేదా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

Advertisement
 
Advertisement
Advertisement