బిగ్‌బాస్‌: మెరుపుతీగలా వచ్చిపోయింది వీళ్లే! | Bigg Boss Telugu 5: From Jyothi To Sarayu These Contestants Eliminated 1st Week | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: ఐదు సీజన్లలో తొలివారమే ఎలిమినేట్‌ అయింది వీళ్లే

Published Mon, Sep 13 2021 8:02 PM | Last Updated on Mon, Sep 13 2021 8:39 PM

Bigg Boss Telugu 5: From Jyothi To Sarayu These Contestants Eliminated 1st Week - Sakshi

ఒక్కవారంలోనే కంటెస్టెంట్లను జడ్జ్‌ చేయడం సరికాదని బిగ్‌బాస్‌ వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. పైగా నామినేషన్స్‌లోకి వచ్చినవారిలో కొందరిని బిగ్‌బాస్‌ కావాలని..

Telugu Bigg Boss, 1st Week Eliminated Contestants: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అంటే ఇదేనేమో.. బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టే ఛాన్స్‌ వచ్చినా ప్రేక్షకులు కనికరించకపోవడంతో మొదటివారమే ఇంటిబాటపట్టారు చాలామంది సెలబ్రిటీలు. బిగ్‌బాస్‌ ఆడే నాటకంలో వారం రోజులకే ఎలిమినేట్‌ అవక తప్పలేదు. తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలో ఇప్పటివరకు ఐదుగురు సెలబ్రిటీలు అందరి కంటే ముందే షోలో ఎలిమినేట్‌ అయ్యారు. వారెవరన్నది చూసేద్దాం..

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్‌ తొలి సీజన్‌లో నటి జ్యోతి అందరికంటే ముందుగా ఎలిమినేట్‌ అయింది. నేచురల్‌ స్టార్‌ నాని హోస్ట్‌గా వ్యవహరించిన రెండో సీజన్‌లో సంజన అన్నె షోలో అడుగు పెట్టిన వారం రోజులకే అందరికీ వీడ్కోలు పలుకుతూ హౌస్‌ నుంచి బయటకు వచ్చేసింది. కింగ్‌ నాగ్‌ బిగ్‌బాస్‌ హోస్టింగ్‌ను భుజానికెత్తుకున్న మూడో సీజన్‌లో నటి హేమ మొదటివారమే ఎలిమినేట్‌ అయింది. నాలుగో సీజన్‌లో సూర్య కిరణ్‌ను ఎలిమినేట్‌ చేయగా తాజా సీజన్‌లో సరయూ ఫస్ట్‌ వీక్‌లోనే బయటకొచ్చింది. 

అయితే వీరిలో కొందరు కోపం, కొట్లాటల కారణంగానే ముందుగా ఎలిమినేట్‌ అయ్యారనేది తెలిసిన విషయమే. కాకపోతే ఒక్కవారంలోనే కంటెస్టెంట్లను జడ్జ్‌ చేయడం సరికాదని బిగ్‌బాస్‌ వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. పైగా నామినేషన్స్‌లోకి వచ్చినవారిలో కొందరిని బిగ్‌బాస్‌ కావాలని నెగెటివ్‌గా చూపిస్తారనేది కూడా కొంతమంది వాదన. మరికొందరినేమో కనీసం తెర మీద కూడా చూపించకుండా మాయ చేస్తాడనేది మరో విమర్శ. అందుకే ఎన్నో ఆశలతో బిగ్‌బాస్‌ షోలో అడుగు పెట్టే కంటెస్టెంట్లకు వారేంటో నిరూపించుకునేందుకు ఒక్క అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది చాలామంది అభిప్రాయం. ఇందుకుగానూ తొలివారం ఎలిమినేషన్‌ను ఎత్తేస్తే బాగుంటుందని బుల్లితెర అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement