Bigg Boss 5 Telugu: అతడు టాప్‌ 5లో ఉంటాడన్న తనీష్‌

Bigg Boss Telugu 5: Actor Tanish About Top Finalist - Sakshi

Tanish About Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ మొదలై ఇంకా వారం కూడా అవలేదు. అప్పుడే కంటెస్టెంట్లకు బయట ఆర్మీలు కూడా పుట్టుకొచ్చాయి. ఇక షో మొదటివారంలోనే కొందరు కంటెస్టెంట్లు దూకుడు చూపిస్తుంటే మరికొందరు మాత్రం ఇప్పటికీ అందరినీ అబ్జర్వ్‌ చేస్తూ ఆ ఇంటిని అలవాటు చేసుకునే పనిలోనే ఉన్నారు. తాజాగా ఈ షో గురించి బిగ్‌బాస్‌ సెకండ్‌ సీజన్‌ కంటెస్టెంట్‌ తనీష్‌ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐదో సీజన్‌లో తన క్లోజ్‌ ఫ్రెండ్‌ మానస్‌ ఉన్నాడని, అతడు చాలా మంచి మనిషని చెప్పుకొచ్చాడు. అతడు తప్పకుండా టాప్‌ 5లో అడుగు పెడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్‌ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ తనకు పెద్దగా పరిచయం లేదని పేర్కొన్నాడు. అలాగే దీప్తి సునయన తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని స్పష్టం చేశాడు.

కాగా బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో తనీష్‌తో పాటు దీప్తి సునయన కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆమె తన ప్రియుడు, యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ను ఒంటరిగా వదిలేసి మరీ షోలో అడుగు పెట్టింది. అయితే హౌస్‌లో అడుగు పెట్టాక ఆమె తనీష్‌కు దగ్గరైంది. హౌస్‌లో దీప్తి సునయనకు ఏ చిన్న కష్టమొచ్చినా ఆమె వెన్నంటే నిలబడ్డాడు తనీష్‌. ఇద్దరూ ఒకరి గురించి మరొకరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడంతో వాళ్ల మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ స్టార్ట్‌ అయిందని అభిప్రాయపడ్డారు జనాలు.

వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ సోషల్‌ మీడియాలో కథనాలు సైతం వెలువడ్డాయి. కానీ హౌస్‌ నుంచి బయటకు వచ్చాక ఈ ఇద్దరూ తాము కేవలం స్నేహితులమేనని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా వుంటే గతంలో పలు కారణాల వల్ల దీప్తి సునయన, షణ్నూల మధ్య కొంత దూరం పెరిగినప్పటికీ, ఇప్పుడు మాత్రం మళ్లీ క్లోజ్‌ అయిపోయారు. ఈమధ్యే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన తన ప్రియుడు షణ్నూకు గట్టి సపోర్ట్‌ ఇస్తోందీ భామ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top