బిగ్‌బాస్‌: కుమార్ సాయి రీఎంట్రీ? | Bigg Boss Telugu 4: There Is A Chance For Kumar Sai Re Entry | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న కుమార్ సాయి!

Nov 15 2020 4:33 PM | Updated on Nov 15 2020 7:05 PM

Bigg Boss Telugu 4: There Is A Chance For Kumar Sai Re Entry - Sakshi

కుమార్ సాయి.. ఈ కంటెస్టెంటు మీ అంద‌రికీ గుర్తుండే ఉంటాడు. బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ నుంచి సూర్య కిర‌ణ్ బ‌య‌ట‌కు అడుగు పెట్ట‌గానే తొలి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కుమార్ సాయి లోనికి వెళ్లాడు. మంచివాడే కానీ క‌న్ఫ్యూజ‌న్ ఎక్కువ‌. ఈ ఒక్క కార‌ణంతోనే ప‌దేప‌దే నామినేష‌న్‌లోకి వ‌చ్చి చివ‌రికి ఆరో వారంలో ఎలిమినేట్ అయ్యాడు. అయితే అన‌ధికార పోల్స్‌లో  కుమార్ క‌న్నా మోనాల్‌ స్వ‌ల్ప ఓట్ల‌తో చివ‌రి స్థానంలో ఉంది. అయినా స‌రే, మోనాల్‌ను కాద‌ని అత‌డిని ఎలిమినేట్ చేయ‌డంతో చాలామంది ప్రేక్ష‌కులు బిగ్‌బాస్‌ను తిట్టిపోశారు. ఎలిమినేష‌న్ మీద ఎన్నో ప్ర‌శ్న‌ల‌ను లేవనెత్తారు. ఎలిమినేష‌న్ ప్రేక్ష‌కుల చేతిలో లేద‌ని అంతా బిగ్‌బాస్ ప్లాన్ ప్ర‌కార‌మే జ‌రుగుతుంద‌ని విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో అత‌డు మ‌ళ్లీ  హౌస్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న‌ట్లు ఓ వార్త నెట్టింట తెగ‌ చ‌క్కర్లు కొడుతోంది. అదే క‌న‌క నిజ‌మైతే ఎవ‌రి వ‌ల్ల అత‌డు బిగ్‌బాస్‌ను వీడి వ‌చ్చాడో ఆమె డేంజ‌ర్ జోన్‌లో ప‌డే అవ‌కాశ‌ముంది. అంటే పొర‌పాటున మోనాల్ నామినేష‌న్‌లోకి వ‌స్తే ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు పుష్క‌లంగా ఉన్నాయి. (చ‌ద‌వండి: అఖిల్ అవుట్‌: ఆల‌స్యంగా తెలుసుకున్న బిగ్‌బాస్‌!)

ఎందుకంటే అక్క‌డున్న వారితో పోలిస్తే మోనాల్ అంద‌రిక‌న్నా వీక్ కంటెస్టెంటుగా క‌నిపిస్తోంది. కానీ ఎప్ప‌టి నుంచో ఆమెను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటూ వ‌స్తున్న బిగ్‌బాస్ మోనాల్‌ను వ‌దులుకుంటాడా? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇక కుమార్ రీ ఎంట్రీ గురించి సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ప‌లుర‌కాలుగా మాట్లాడుకుంటున్నారు. అత‌డు రావ‌డం వ‌ల్ల హౌస్‌లో ప‌రిస్థితులు మారిపోయే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు మాత్రం అత‌డిని తీసుకురావ‌డం వెన‌క కుట్ర ఉంద‌ని మ‌రో కోణాన్ని ఎత్తి చూపుతున్నారు. అత‌డు వ‌స్తే క‌చ్చితంగా వ‌చ్చేవారం మ‌ళ్లీ అత‌డే ఎలిమినేట్ అవుతాడ‌ని, త‌ద్వారా లాస్య‌, మోనాల్‌ను సేవ్ చేయాల‌నుకుంటున్నార‌ని కామెంట్లు చేస్తున్నారు. మ‌రి అస‌లు కుమార్ సాయి రీఎంట్రీ ఉంటుందా? లేదా? అన్న‌ది అధికారికంగా తెలియాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు వేచి చూడాల్సిందే. (చ‌ద‌వండి: జోక‌ర్ ఎలిమినేటెడ్‌, కానీ ఆ కోరిక నెర‌వేర‌నుంది)

Advertisement
 
Advertisement
Advertisement