బిగ్‌బాస్‌ : ఇది రా మజా అంటే.. సోహైల్‌ | Bigg Boss Telugu 4 Telugu : Captaincy Task Goes Viral | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : ఇదిరా మజా అంటే.. సోహైల్‌

Nov 20 2020 7:36 PM | Updated on Nov 20 2020 8:53 PM

Bigg Boss Telugu 4 Telugu : Captaincy Task Goes Viral - Sakshi

బిగ్‌బాస్‌ పదకొండోవారంలో టాస్క్‌ల కంటే కుటుంబ సభ్యుల సందడే ఎక్కువగా ఉంది. గత రెండు ఎపిసోడ్లు కంటెస్టెంట్స్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ని తీసువచ్చి ఏడిపించడంతోనే గడిచిపోయాయి. ఇక నేటి ఎపిసోడ్‌తో ఫ్యామిలీ మెంబర్స్‌ ఎంట్రీకి ఎండ్‌కార్డు పడనుంది. ఈ రోజు ఎపిసోడ్‌లో లాస్య భర్త, కొడుకు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ తర్వాత పదకొడో వారంలో అసలు టాస్క్‌ మొదలు కానుంది. అదే కెప్టెన్సీ టాస్క్‌.

దీనికి హారిక, అభిజిత్‌, అఖిల్‌ పోటీ పడినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఈ ముగ్గురు మిగతా ఇంటి సభ్యులను ఒప్పించి వారి భుజాల మీద కూర్చోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ సేపు కిందికి దిగకుండా భుజాల మీద ఉంటారో వాళ్లు ఇంటి కెప్టెన్‌ అవుతారు. దీంట్లో భాగంగా అభిజిత్‌ను అవినాష్‌, అఖిల్‌ను సోహైల్‌, హారికను మోనాల్‌ తమ తమ భుజాలపై ఎత్తుకున్నారు. అయితే అభి బరువును మోయలేక అవినాష్‌ తటపటాయించి నట్లు తెలుస్తోంది. ఇక సోహైల్‌ అయితే ఇదిరా మజా అంటూ.. అఖిల్‌ను తన భూజాలపై ఎక్కించుకున్నాడు. మరి ఈ టాస్క్‌లో గెలిచి, కెప్టెన్‌ అయిందెవరో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement