అరియానా నీకు ప‌డ‌దు: తేల్చేసిన నాగార్జున‌ | Bigg Boss Telugu 4: Nagarjuna Wife Amala Send Gifts To Inmates | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: క‌ంటెస్టెంట్ల‌కు అమ‌ల గిఫ్టులు

Nov 14 2020 5:54 PM | Updated on Nov 14 2020 8:34 PM

Bigg Boss Telugu 4: Nagarjuna Wife Amala Send Gifts To Inmates - Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు చాలా ల‌క్కీ. ఎందుకంటే వాళ్ల‌కు గిఫ్టుల మీద గిఫ్టులు ఇస్తున్నారు. బ‌య‌ట ఉంటే అన్ని బ‌హుమ‌త‌లు కచ్చితంగా వ‌చ్చి ఉండేవి కావు. మొన్న‌టికి మొన్న ఒక‌రికొక‌రు బ‌హుమ‌తులు ఇచ్చి పుచ్చుకోగా రెండు రోజుల క్రితం ఇంటి స‌భ్యుల నుంచి లేఖ‌లు అందుకున్నారు. ఊహించ‌ని ప‌రిణామానికి ఇంటి స‌భ్యులు సంతోషంలో మునిగి తేలుతుండ‌గా వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఆప్తుల నుంచి బ‌‌హుమ‌తులు వ‌చ్చాయి. ఇక దీపావ‌ళి సంద‌ర్భంగా నాగార్జున నేడు వారిని స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నాడు. (చ‌ద‌వండి: ఆయన ఐడియాలు మాత్రమే ఇస్తాడు.. సోహైల్‌)

నాగార్జున‌ భార్య అమ‌ల స్వ‌యంగా కొనుగోలు చేసిన బ‌హుమ‌తుల‌ను సంచుల కొద్దీ కంటెస్టెంట్లు అందించ‌డంతో వారు ఎగిరి గంతేశారు. వెలుగులు విర‌జిమ్మే దీపావ‌ళి నాడు కాల్చే ప‌టాసుల‌ను  ఒక్కొక్క‌రికి అంకితం చేయ‌మ‌ని నాగ్ ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో లాస్య సోహైల్‌ను చిచ్చుబుడ్డితో పోల్చింది. లాస్య‌ను ఆంటీ అంటున్నారేంటి అని నాగ్ ప్ర‌శ్నిస్తున్న‌ట్లు న‌టిస్తూనే ఆమెను ఆంటీ ఆంటీ అని ప‌దేప‌దే పిలుస్తూ ఏడిపించారు. అలాగే అభిజిత్ గే బార్‌కు వెళ్లిన విష‌యాన్ని నాగ్ ప్ర‌స్తావించ‌డంతో అత‌డికి త‌లెక్క‌డ పెట్టుకోవాలో తెలీలేదు. ఇక అవినాష్ అరియానాకు ఉల్లిపాయ బాంబు ఇచ్చిన‌ట్లు క‌నిపించగా నాగ్ జోక్యం చేసుకుంటూ నువ్వు ఆటంబాంబు ఇచ్చినా ఆమె ప‌డ‌దు అని క్లారిటీ ఇచ్చారు. దీంతో నా పెళ్లి చూపులు పెటాకులైన‌ట్లేన‌ని అవినాష్ డిసైడ్ అయిపోయాడు. కాగా నేటి ఎపిసోడ్‌లో అఖిల్ రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. (చ‌ద‌వండి: అవినాష్‌ను వెంటాడుతున్న ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు?)

కాగా నిన్న‌టి ఎపిసోడ్‌లో అరియానా, అవినాష్ పింక్ క‌ల‌ర్ దుస్తులే ధ‌రించిన సంగ‌తి తెలిసిందే. దీంతో కాసేపు పులిహోర క‌లిపేందుకు ప్ర‌య‌త్నించిన అవినాష్‌ను ఆట‌కు అడ్డుక‌ట్ట వేస్తూ నేనేం ప‌డ‌ను నీకు అని చెప్పేసింది. దీంతో నీకు అంత సీను లేదు, నాకు ఆ ఆలోచ‌నే లేదు అని క‌వ‌ర్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. అత‌డి ఆవేద‌న‌ను అర్థం చేసుకున్న అరియానా నేను నీకు ప‌డిపోతాలే అని ధైర్యం చెప్పింది. దీంతో అవినాష్‌.. మ‌నం ఫ్రెండ్స్‌. ఎందుకు ప‌డ‌తాం. ఈ ప‌డిపోవ‌డాలు ఏంటి? అంటూ ఏమీ ఎరుగ‌న‌ట్టు మాట్లాడుతూ టాపిక్ డైవ‌ర్ట్ చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement