బిగ్‌బాస్‌ 5: హోస్ట్‌గా మాస్‌ హీరో రంగంలోకి!

Bigg Boss Tamil: Mass Hero To Replace Kamal Haasan For Next Season - Sakshi

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్‌బాస్‌ వస్తుందంటే చాలు ఎంతో మంది టీవీల ముందు అతుక్కుపోతారు. తెలుగు, హిందీ తమిళ, కన్నడ భాషల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ కొట్లాది ప్రేక్షకులను అలరిస్తుంది. కాగా తమిళంలో బిగ్‌బాస్‌ ఇప్పటి వరకు నాలుగు సీజన్‌లు పూర్తి చేసుకుంది. ఈ నాలుగు సీజన్‌లకు విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తన హోస్టింగ్‌తో నాలుగు సీజన్‌లను విజయవంతంగా పూర్తిచేశారు. బిగ్‌బాస్‌కు ఎంత ఫాలోయింగ్‌ ఉందో కమల్‌ హాసన్‌ హోస్టింగ్‌కు కూడా అంతే ఉంది. 

తాజాగా తమిళ బిగ్‌బాస్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. త్వరలో బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే నటుడు కమల్‌ హాసన్‌ ఇకపై బిగ్‌బాస్‌ హోస్ట్‌ చేయడని ఈ వార్తల సారంశం. మొదటి మూడు సీజన్ల మాదిరిగానే ఈ సంవత్సరం జూన్ లేదా జూలైలో  ‘బిగ్ బాస్ 5’ ప్రారంభ కానున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌ అయిదో సీజన్‌కు కమల్‌ రావడం లేదని సమాచారం. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యుమ్ పార్టీ స్థాపించి తమిళనాడు ఎన్నికల్లో బిజీగా మారారు. అంతేకాకుండా ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీకి జరిగే తన మొదటి ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బిగ్‌బాస్ 5కి హోస్ట్‌గా వ్యవహరించడం అనుమానంగానే మారింది. దీంతో కమల్‌ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 

అయితే తెరపైకి మరో యువ నటుడి పేరు వినిపిస్తోంది. కమల్‌ స్థానంలో మాస్‌ హీరో శింబు వ్యాఖ్యాతగా వ్యవహరించున్నట్లు తెలుస్తోంది.ఇ ప్పటికే ‘బిగ్ బాస్ 5’ నిర్మాతలు శింబూతో చర్చలు ప్రారంభించారని, ఆయనకు కూడా చాలా ఆసక్తి ఉన్నారని టాక్‌ వినిపిస్తోంది. కాగా తమిళంలో శింబుకు కూడా ప్రత్యేక పాపులారిటీ ఉంది. అంతేగాక ఉన్నది ఉన్నట్లు తన అభిప్రాయాన్ని చెప్పడంలో శింబు వెనకాడడు. ఒకవేళ ఇదే వార్త నిజమైతే బిగ్‌బాస్‌ ఈ సారి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు.

చదవండి: నా కొడుకుతో సహా బిగ్‌బాస్‌కు వెళ్తా!: నటి
'అవ్వ బంగారం' అంటూ అఖిల్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top