Bigg Boss OTT Non Stop: Natraj Master Entered As 8th Contestant, Deets Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss OTT Telugu: ఎనిమిదో కంటెస్టెంట్‌గా నటరాజ్‌ మాస్టర్‌

Feb 26 2022 7:20 PM | Updated on May 16 2022 10:03 AM

Bigg Boss OTT Non Stop: Natraj Master Entered As 8th Contestant, Know His Details - Sakshi

తెలుగులో వస్తున్న డ్యాన్స్‌ రియాలిటీ షోలకు నటరాజ్‌ మాస్టర్‌ ఓరకంగా ఆద్యుడని చెప్పవచ్చు. గతంలో ఉదయభానుతో కలిసి డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌ షో చేసిన నటరాజ్‌ పలు షోలకు కొరియోగ్రాఫర్‌గా, మెంటార్‌గా వ్యవహరించాడు. దాదాపు టాప్‌ హీరోలు, దర్శకులందరితోనూ కలిసి పని చేసిన నటరాజ్‌ మాస్టర్‌కు 20 ఏళ్లకు పైనే అనుభవం ఉంది.

కృష్ణా జిల్లాకు చెందిన ఈ కొరియోగ్రాఫర్‌ ఏడు సంవత్సరాలుగా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. భార్య ఏడు నెలల గర్భంతో ఉన్నప్పుడు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో అడుగు పెట్టిన ఆయన బిడ్డ పుట్టిన తర్వాత మరోసారి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాడు. అప్పుడు భార్య కోసం, ఇప్పుడు కూతురి కోసం షోలోకి వచ్చానని, ఈసారి మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. రోరింగ్‌ ట్యాగ్‌తో హౌస్‌లో అడుగుపెట్టిన నటరాజ్‌ మాస్టర్‌ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు ఏయే జంతువుల పేర్లు పెడతాడు? కోపాన్ని కంట్రోల్‌ చేసుకుని ఎలా ఆడతాడో చూడాలి!

Advertisement
 
Advertisement
Advertisement