ఫైమా కోసం ఎంతో ఏడ్చాను.. ఫైనల్‌గా నన్ను రిజక్ట్‌ చేసింది: ప్రవీణ్‌ | Sakshi
Sakshi News home page

Bigg Boss Faima: ఫైమా కోసం ఎంతో ఏడ్చాను.. ఫైనల్‌గా నా ప్రేమను రిజక్ట్‌ చేసింది: ప్రవీణ్‌

Published Mon, Oct 30 2023 8:41 AM

Bigg Boss Faima Rejected Praveen Love - Sakshi

ప్రవీణ్‌, ఫైమా పలు ఎంటర్‌టైన్‌మెంట్‌ షోలతో స్టేజీపైన మెప్పించిన బుల్లితెర నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఎన్నో వీడియోలు షేర్‌ చేశారు. ఈ విషయంపై ప్రవీణ్‌ మొదటిసారి తన ప్రేమ గురించి రివీల్‌ చేశాడు. బిగ్‌ బాస్‌ ఫైమాతో ప్రవీణ్‌ ప్రేమలో ఉన్నాడని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఫైమాతో ప్రేమలో పడినట్లు టీవీ స్టేజీలపైనే ఓపెన్‌గా చెప్పాడు.. త్వరలో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. అప్పుడు ఫైమా నుంచి కూడా వ్యతిరేకత రాలేదు.

కానీ అవన్నీ ఆడియన్స్‌ను మెప్పించేందుకు చేసిన స్క్రిప్ట్స్‌ అని చెప్పుకున్నా.. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వారి సొంత యూట్యూబ్‌ చానల్స్‌లలో పలు వీడియోలు కూడా చేశారు. చివరకు ఫైమా వాళ్ల ఇంటికి కూడా ప్రవీణ్‌ పలుమార్లు వెళ్లాడు.. ఆ సమయంలో ఫైమా తల్లిగారిని అత్తయ్య అని పిలిచేవాడు. అంత సన్నిహిత్యం ఆమె కుటుంబంతో ప్రవీణ్‌కు ఉంది. దీంతో వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు విపరీతంగా ట్రెండ్‌ అయింది. ఈ విషయాలన్నింటిపైనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రవీణ్‌ రియాక్ట్‌ అయ్యాడు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: సందీప్ ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?)

'ఫైమాతో ప్రేమ అనేది ఫ్రెండ్సిప్‌తో ప్రారంభమైంది. నా జర్నీ ప్రారంభం నుంచి ఆమె నాతోనే ఉన్నారు. అందుకే ప్రేమిస్తున్నాని చెప్పాను. దానికి ఆమె నో చెప్పింది. నా పరంగా చెప్పాల్సింది చెప్పాను.. ఆమెకు ఇష్టం ఉండవచ్చు.. లేకపోవచ్చు ఆమె నిర్ణయాన్ని తప్పపట్టలేను. అంతేకాకుండా ఆమె నో చెప్పిందని తనకు దూరంగా నేను ఎప్పుడూ లేను. మా మధ్య ప్రేమ లేకున్నా ఫ్రెండ్స్‌గా ఉందామని అనుకున్నాం. ఒక మంచి ఫ్రెండ్‌గా ఆమె వెంట ఎప్పుడూ ఉంటాను. కానీ ఆమె నా ప్రేమను అంగీకరించలేదనే బాధ చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఒకానొక సమయంలో బాగా ఏడ్చాను.

ఫస్ట్‌ లవ్‌ ఈజ్‌ బెస్ట్‌ లవ్‌ అంటారు కదా.. అందుకే ఆమె గురించి ఏడ్చాను. ఆమె రిజెక్ట్‌ చేసినప్పుడు ముందు బాధపడినా... తర్వాత రిలైజ్‌ అయ్యి అంతా నా మంచికే అనుకున్నా. ప్రస్తుతం నా ఫ్యామిలీ సమస్యలు నాకు ఎక్కువగా ఉన్నాయి. వాటి గురించే ఎక్కువగా పోరాడుతున్నాను.  ఈ మధ్య మా నాన్నగారు చనిపోయారు. ఆయన చనిపోయాకు మా అప్పుల గురించి తెలిసింది. ప్రస్తుతం వాటిని చెల్లించే పనిలో ఉన్నాను. ఒకవేళ ఫైమా నన్ను ప్రేమిస్తున్నాను అని భవిష్యత్‌లో చెబితే తప్పకుండా అంగీకరిస్తాను.' అని ప్రవీణ్‌ తెలిపాడు.

బిగ్‌ బాస్‌ నుంచి వచ్చాకే ఫైమాలో మార్పు..?
బిగ్‌బాస్‌ నుంచి వచ్చాక ఫైమాలో చాలా మార్పులు వచ్చాయని, ఆ షో ద్వారా ఆమెకు మంచి గుర్తింపుతో పాటు సెలబ్రిటీ హోదా రావడంతోనే ప్రవీణ్‌ను పక్కన పెట్టేసిందని వార్తలు వచ్చాయి. వాటికి ప్రవీణ్‌ ఇలా రియాక్ట్‌ అయ్యాడు. 'బిగ్‌ బాస్‌ నుంచి ఎలిమినేషన్‌ అయ్యాక ఫైమా బాగా హర్ట్‌ అయింది. ఆ మైండ్‌ సెట్‌లోనే ఉండిపోయింది. మొదట కొద్దరోజులు ఆమె ఎవర్నీ కలవలేదు. తర్వాత నాతో మంచిగానే మాట్లాడింది. ఆమె బిగ్‌ బాస్‌లో ఉన్నప్పుడు ఆమె కోసం నేను ఎంతో సపోర్ట్‌ చేశాను. నేను ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఫైమాకు ఓట్లు వేయాలని కోరినా.. ఆమె నా మనిషి అని ఆమె విజయం కోసం నేను ఎంతో ప్రయత్నం చేశాను.' అని తెలిపాడు.

ప్రవీణ్‌ను ఫైమా మోసం చేసిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కానీ ప్రవీణ్‌ ఆ విషయం చెప్పకుండా తను మాత్రమే ప్రేమించానని.. ఫైమా ప్రేమించలేదని చెబుతూ ఆమెను సేఫ్‌ చేస్తున్నాడని చెబుతున్నారు. బిగ్‌బాస్‌లో ఉన్నప్పడే ప్రవీణ్‌ అంటే ఇష్టం అని నాగార్జున గారితో ఫైమా చెప్పిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా ప్రవీణ్‌ మాత్రం వన్‌సైడ్‌ లవర్‌ బాయ్‌లా మిగిలాడు.

 
Advertisement
 
Advertisement