బిగ్‌బాస్‌లోకి వచ్చిన నబీల్ తల్లి.. ఏడ్చేసిన టేస్టీ తేజ | Bigg Boss 8 Telugu Day 72 Promo Family Week | Sakshi
Sakshi News home page

Bigg Boss 8: తల్లిని తలుచుకుని బాధపడిన తేజ.. లేటెస్ట్ ప్రోమో

Nov 12 2024 12:03 PM | Updated on Nov 12 2024 12:40 PM

Bigg Boss 8 Telugu Day 72 Promo Family Week

బిగ్‌బాస్ ఏ సీజన్ తీసుకున్నా సరే మిగతా రోజులు హౌస్‌మేట్స్ ఎవరెలా ప్రవర్తించినా, ఎన్ని తిట్టుకున్నా సరే ఓ వారం మాత్రం అందరూ ఒక్కటైపోతారు. అదే 'ఫ్యామిలీ వీక్'. ప్రతి సీజన్‌లో ఉన్నట్లే ఈసారి కూడా వచ్చేసింది. ఈ వారమే కుటుంబ సభ్యులు.. హౌస్‌లోకి రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు రిలీజ్ చేశారు.

షో ప్రారంభంలో కాస్త హడావుడి చేసిన ఓరుగల్లు కుర్రాడు నబీల్.. ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఫ్యామిలీ వీక్‌లో మొదటిగా ఇతడి తల్లి హౌస్‌లో అడుగుపెట్టింది. అంతకు ముందు నబీల్‌ని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన బిగ్‌బాస్.. తినమని స్వీట్స్ ఇచ్చాడు.

(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)

మరోసారి లోపలికి పిలిచి కాసేపు అలానే ఉండమన్నాడు. ఆ తర్వాత టీవీ స్క్రీన్‌పై అమ్మ హౌసులోకి వచ్చిన విషయాన్ని చూపించాడు. దీంతో 70 రోజుల తర్వాత తల్లిని కలిసిన నబీల్.. ఎమోషనల్ అ‍య్యాడు. చాలాసేపు మాట్లాడుకున్నాడు. ఇదంతా చూసి టేస్టీ తేజ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

గత వీకెండ్‌లో తేజకి చిన్న తప్పుకి పెద్ద క్లాస్ పీకిన నాగార్జున.. ఫ్యామిలీ వీక్‌కి అనర్హుడిని చేశాడు. అంటే తేజ కోసం కుటుంబ సభ్యులు ఎవరూ హౌస్‌లోకి రారు. దీంతో నబీల్ కోసం అతడి తల్లి రావడం చూసి.. ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాడు. దీంతో మిగతా హౌస్‌మేట్స్ అతడిని ఓదార్చుతూ కనిపించారు.

(ఇదీ చదవండి: 'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement