Bigg Boss 7: బయటపడ్డ శివాజీ మరో కోణం.. మనోడు బిగ్‌బాస్‌లో బ్రెయిన్‌లెస్ 'చాణక్య'! | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 79 Highlights: శివాజీ మైండ్ చదివేసిన గౌతమ్.. ఎవిక్షన్ పాస్ విన్నర్‌గా రైతుబిడ్డ

Published Tue, Nov 21 2023 11:11 PM

 Bigg Boss 7 Telugu Day 79 Episode Highlights - Sakshi

శివాజీ పేరు చెప్పగానే బిగ్‌బాస్ షోలో చాణక్య అని అంటారేమో! కానీ అంత సీన్ లేదని లేటెస్ట్ ఎపిసోడ్‌తో క్లారిటీ వచ్చేసింది. 12వ వారం నామినేషన్స్‌లో అసలు రంగు అంతా బయటపడింది. అస్సలు బుర్రలేదన్నట్లుగా నోటికొచ్చినట్లు మాట్లాడి ఇజ్జత్ మొత్తం తీసేసుకున్నాడు. డాక్టర్‌బాబు గౌతమ్ అయితే శివాజీ మైండ్‌ని చదివేశాడు. అసలు ఈ పెద్దాయన ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో క్లారిటీగా చెప్పేశాడు. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 79 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు)

గౌతమ్, శివాజీ.. ఇద్దరూ ఇద్దరే!
ఆరుగురు హౌస్‌మేట్స్ సోమవారం ఎపిసోడ్‌లో తమ నామినేషన్స్ పూర్తి చేశారు. ఆగిన దగ్గర నుంచి మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. గౌతమ్‌ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పిన శివాజీ.. బ్యాలెన్సింగ్ టాస్క్‌తోపాటు మిగతా విషయాల్ని కారణాలుగా చెప్పాడు. కానీ గౌతమ్ మాత్రం... పాయింట్ టూ పాయింట్ చెప్పండన్నా అనేసరికి శివాజీ వాదించలేకపోయాడు. తర్వాత అశ్విని పేరు శివాజీ చెప్పాడు గానీ ఆమె సెల్ఫ్ నామినేట్ కాబట్టి.. ఆమెని నామినేట్ చేయడానికి వీల్లేదని బిగ్‌బాస్ చెప్పడంతో అర్జున్‌ని నామినేట్ చేశాడు.

ఎవరు ఎవరిని నామినేట్ చేశారు?
శివాజీ - గౌతమ్, అశ్విని
యావర్ - అమర్‌దీప్, అర్జున్
శోభాశెట్టి - శివాజీ, అర్జున్
ప్రియాంక - యావర్, శివాజీ

యావర్‌తో మాటల్లేవు!
శివాజీది పూర్తయిన తర్వాత యావర్.. అమర్, అర్జున్‌ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. తన తప్పొప్పుల గురించి, చేసినప్పుడే ఎందుకు చెప్పలేదని యావర్, అర్జున్‌ని అడిగాడు. అయితే ఇది చాలా సిల్లీ రీజన్ అని, ఇక హౌసులో ఉన్నన్నీ రోజులు నీతో మాట్లాడేది లేదని అర్జున్ సీరియస్‌గా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు కెప్టెన్‌గా నిన్ను కంట్రోల్ చేయాలని చూస్తే.. 'కెప్టెన్ కాదు నువ్వు' అని ఎందుకన్నావ్, అది నచ్చలేదని ప్రియాంక, యావర్‌ని నామినేట్ చేసింది. దీంతో తెలుగు సరిగా రానీ యావర్‌కి ఏం అర్థమైందో ఏంటో గానీ.. 'వేస్కో అది' అని పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేస్తూ వెళ్లిపోయాడు.

(ఇదీ చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!)

శివాజీ దగ్గర నో ఆన్సర్
యావర్ తర్వాత శివాజీని నామినేట్ చేస్తున్నట్లు ప్రియాంక చెప్పింది. రాజమాతలు టాస్కులో నేను చేసింది తప్పని ఎలా అంటారు? మేం ఏం మాట్లాడుకున్నామో మీకేమైనా తెలుసా? అని ప్రియాంక అడిగేసరికి శివాజీ దగ్గర సమాధానం లేదు. దీంతో తనకు అలవాటు అయినట్లు నానా హంగామా చేశాడు. మీరు ఏమనుకుంటారో అదే చేస్తారు, నామినేషన్ యాక్సెప్టెడ్ అని అనేసి శివాజీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మరి.. మీరు ఇద్దరు(యావర్, ప్రశాంత్) మాత్రమే తప్పులు చేస్తుంటే, చెప్పి మరీ వాళ్లని సరిదిద్దుతున్నారు, మిగతా వాళ్లకు ఎందుకు చెప్పట్లేదని ప్రియాంక అడిగేసరికి.. శివాజీ ట్రిగ్గర్ అయిపోయాడు. ఈ హౌసులో ప్రతిసారి పొరపాట్లు మీద పొరపాట్లు జరుగుతున్నాయి అని అన్నాడు. అవి ఏంటి? అనే ప్రియాంక అడిగితే.. నేను చెప్పలేను, నేను చెప్పలేను అని శివాజీ ఏదేదో మాట్లాడాడు. ఎందుకంటే పెద్దాయన దగ్గర ఆన్సర్ లేదు! ఇక్కడ అర్థమైంది ఏంటంటే.. శివాజీ ఏం చేసినా తప్పు కాదు కానీ పక్కనోళ్లు చిన్న పొరపాటు చేసినా అది తప్పే. నాగార్జున నెత్తికెక్కించుకునేసరికి శివాజీ బాగా రెచ్చిపోతున్నాడు. అందుకే ప్రియాంకపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ.. పెద్దరికం పోగొట్టుకుని బ్రెయిన్‌లెస్ చాణక్య అయిపోయాడు. 

(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఆ రెండు హిట్ మూవీస్.. ఒక్కరోజు గ్యాప్‌లో రిలీజ్!)

శివాజీ గురించి చెప్పిన గౌతమ్
నామినేషన్స్ పూర్తయిన తర్వాత బయట కూర్చుని అర్జున్‌తో మాట్లాడిన గౌతమ్.. శివాజీ అసలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆ మధ్య కొన్ని వారాల పాటు ఆయన్ని ఎవరు ఎదురించలేదు, ఇప్పుడు అలా ఆయన చేసింది తప్పని చెబుతుంటే ఆయన తీసుకోలేకపోతున్నాడని గౌతమ్ చెప్పుకొచ్చాడు. దీంతో శివాజీ అసలు రంగు బయటపడినట్లయింది.

ప్రియాంక తనని నామినేట్ చేయడాన్ని తీసుకోలేకపోయిన శివాజీ.. తన బ్యాచ్ సభ్యులైన యావర్, ప్రశాంత్‌తో మాట్లాడుతూ.. గేమ్ ఆడటానికి వచ్చినా కూడా ఓ క్యారెక్టర్ అంటూ ఉండాలి. పెద్ద గేమ్, స్ట్రాటజీ, నేను ఇలానే ఆడతాను లాంటివి అనడం ఓకే, కానీ క్యారెక్టర్ కావాలి కదా అని శివాజీ అన్నాడు. మరి ఇంత చెప్పినా శివాజీకి ఏమైనా క్యారెక్టర్ ఉందా అంటే లేదు. ఎప్పుడు చూడు ఆ యావర్-ప్రశాంత్‌లని రెచ్చగొట్టి అవతలి వాళ్లపైకి పంపించడం తప్పితే గేమ్ ఆడిన దాఖలాలు అయితే పెద్దగా కనిపించలేదు. ఎపిసోడ్ చివర్లో ఎవిక్షన్ పాస్ కోసం బ్యాలెన్సింగ్ టాస్క్ పెట్టగా అందులో రైతుబిడ్డ ప్రశాంత్ విజయం సాధించాడు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.

ఈ వారం నామినేషన్స్‌ లిస్ట్

  • శివాజీ
  • అర్జున్
  • రతిక
  • గౌతమ్
  • ప్రశాంత్
  • యావర్
  • అమర్‌దీప్
  • అశ్విని

(ఇదీ చదవండి: ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న రైతుబిడ్డ.. ఆమెని దెబ్బకొట్టడం గ్యారంటీ!?)

Advertisement
 
Advertisement
 
Advertisement