Bigg Boss 6 Telugu: Shrihan As Eighth Week Captain - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: కలిసిపోయిన సునయ! ఈ వారం కెప్టెన్‌ ఎవరంటే?

Oct 27 2022 3:54 PM | Updated on Oct 27 2022 4:15 PM

Bigg Boss 6 Telugu: Shrihan As Eighth Week Captain - Sakshi

మరోవైపు సూర్యను బావా అని పిలుస్తూ దగ్గరైన ఇనయ.. అతడు టాప్‌ 5లో కూడా ఉండకూడదని విషం చిమ్మింది. మళ్లీ ఇంతలోనే అతడిని పట్టుకుని ఏడుస్తూ కనిపించింది.

ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడొక లెక్క అన్న రీతిలో గేమ్‌ ఆడుతున్నారు హౌస్‌మేట్స్‌. ప్రతి ఒక్కరూ ఎవరికి వారే కెప్టెన్‌ అయిపోదామన్న కసితో ఆడుతున్నారు. కానీ గీతూ మాత్రం గేమ్‌ మొదటి రౌండ్‌లోనే అవుట్‌ అయిపోవడంతో తనకు నచ్చనివారిని టార్గెట్‌ చేసి సైడ్‌ చేసేస్తోంది. నచ్చినవారికి అనుకూలంగా గేమ్‌ను తిప్పుతోంది. ఈ క్రమంలోనే తనకు దొరికిన నల్ల చేపతో శ్రీహాన్‌-శ్రీసత్యలకు ఎక్కువ చేపలు వచ్చేలా చేసింది. ఇకపోతే ఈరోజు కెప్టెన్సీ టాస్క్‌ జరగనుంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది.

ఇందులో శ్రీహాన్‌, సూర్య, రేవంత్‌, శ్రీసత్య, కీర్తి, ఫైమా తాళ్లు ముడి విప్పే గేమ్‌లో పాల్గొన్నారు. ఫైనల్‌గా శ్రీహాన్‌ గెలిచి కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికి చాలాసార్లు కెప్టెన్సీ కంటెండర్‌ దాకా వచ్చి ఆగిపోయాడు శ్రీహాన్‌. చివరికి ఏడు వారాల తర్వాత తొలిసారి కెప్టెన్‌ అవడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మరోవైపు సూర్యను బావా అని పిలుస్తూ దగ్గరైన ఇనయ.. అతడు టాప్‌ 5లో కూడా ఉండకూడదని విషం చిమ్మింది. మళ్లీ ఇంతలోనే అతడిని పట్టుకుని ఏడుస్తూ కనిపించింది. అంటే బావా మరదళ్లు కలిసిపోయారా? అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

చదవండి: గీతూ టార్గెట్‌ ఆ రెండు జంటలే!
రామ్‌గోపాల్‌ వర్మ సంచలన ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement