Bigg Boss Telugu 6, Episode 85 Highlights: Rajasekhar Hugs And Punches To These Contestants - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: ఆ నలుగురికి హగ్స్‌, మిగతావారికి పంచ్‌ ఇచ్చిన రాజ్‌

Published Sun, Nov 27 2022 11:21 PM | Last Updated on Mon, Nov 28 2022 8:33 AM

Bigg Boss 6 Telugu: Rajasekhar Hugs and Punches To These Contestants - Sakshi

Bigg Boss Telugu 6, Episode 85: ఎవరు తప్పు చేశారో నిలబెట్టి క్లాసు పీకే నాగార్జున ఈసారి మాత్రం డిఫరెంట్‌గా వారి తప్పొప్పులను వారితోనే చెప్పించాడు. హౌస్‌మేట్స్‌లో ఉన్న బ్యాడ్‌ క్వాలిటీస్‌ ఏంటో చెప్పమని ఆదేశించాడు నాగ్‌. ముందుగా రోహిత్‌ మాట్లాడుతూ.. 'కీర్తి ఎక్కువ బాధపడుతుంది, ఫైమా, శ్రీసత్యలో వెటకారం ఎక్కువ. ఇనయ ఎవరికీ అవకాశమివ్వకుండా మాట్లాడుతుంది, రాజ్‌ పాయింట్‌ లేకున్నా అరుస్తాడు, రేవంత్‌కు కోపమెక్కు. శ్రీహాన్‌ గేమ్‌ కన్నా ఫ్రెండ్‌షిప్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు' అంటూ వారిలోని లోపాలను ఏకరువు పెట్టాడు.

ఇలా అందరి గురించి చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్‌ సాగదీయాల్సి వస్తుందనుకున్నాడో ఏమోకానీ నలుగురి కంటెస్టెంట్లలోని చెడు లక్షణాలు చెప్తే సరిపోతుందన్నాడు నాగ్‌. దీంతో ఇనయ మాట్లాడుతూ.. 'శ్రీసత్య గేమ్‌ను లైట్‌గా తీసుకుంటుంది. రేవంత్‌ ఎక్కువ కన్ఫ్యూజన్‌ అవుతున్నాడు. రాజ్‌ నేనున్నానని చూపించుకోవడానికి అరుస్తాడు. ఆదిరెడ్డి ఆడకుండా కూర్చోవడం కరెక్ట్‌ కాదు' అని చెప్పింది. కీర్తి వంతు రాగా రేవంత్‌ అన్న ఓవర్‌ అగ్రెసివ్‌, శ్రీసత్య, శ్రీహాన్‌ వెటకారం, రోహిత్‌ ఎక్కువ కలవకపోవడం మైనస్‌ అని చెప్పింది.

ఆదిరెడ్డి మాట్లాడుతూ.. 'రేవంత్‌ బాగా ఆడతాడు, కానీ తాను బాగా ఆడతానని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇనయ చాలా మాటలు వదిలేస్తుంది. శ్రీసత్యకు కాన్ఫిడెన్స్‌ తగ్గిపోయింది. రోహిత్‌ గట్టిగా స్పందించరు' అని చెప్పాడు. ఫైమా.. సరేవంత్‌ కోపం నచ్చదు. ఇనయ మాటతీరు మార్చుకోవాలి. రోహిత్‌ గేమ్‌లో పెద్దగా పర్ఫామెన్స్‌ కనిపించట్లేదు. కీర్తి ఎక్కువ ఎమోషనల్‌ అవుతుందిస అని చెప్పింది. శ్రీసత్య.. రోహిత్‌ సరైన టైమ్‌కు రియాక్ట్‌ అవడు. కీర్తి ఏం చెప్పినా వినిపించుకోదు. ఇనయ ఎదుటివాళ్లకు మాట్లాడే ఛాన్స్‌ ఇవ్వదు. శ్రీహాన్‌ గేమ్‌ కన్నా ఫ్రెండ్‌షిప్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు అని చెప్పింది.

రాజ్‌ మాట్లాడుతూ.. రోహిత్‌ గట్టిగా మాట్లాడడు. ఇనయ ప్రతిదానిలో దూరుతుంది. శ్రీహాన్‌ గేమ్‌ కన్నా స్నేహానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. శ్రీసత్య నామినేషన్‌లో తను చెప్పాలనుకుంది చెప్పి వెళ్లిపోతుందన్నాడు. ఇక శ్రీహాన్‌ వంతురాగా రాజ్‌కు కాన్ఫిడెన్స్‌ తక్కువ. రోహిత్‌ మంచితనం కొన్నిసార్లు సేఫ్‌గా కనిపిస్తుంది. రేవంత్‌ కొన్ని స్టేట్‌మెంట్లు వదిలేస్తాడు. సరదాగా అయినా సరే వద్దని వారించినా అర్థం చేసుకోడు. శ్రీసత్య వేరేవాళ్ల మాట నమ్మి ఫ్రెండ్‌ను దూరం పెట్టొద్దు అని సూచనలిచ్చాడు. రేవంత్‌.. ఫైమా వెటకారం తగ్గించుకోలేదని, ఆదిరెడ్డి మానిప్యులేటర్‌ అని, ఇనయ, కీర్తి కావాలని రెచ్చగొడుతారని మనసులో ఉన్న కోపాన్నంతా కక్కేశాడు.

అందరూ మాట్లాడింది విన్న నాగ్‌.. మీలోని చెడు లక్షణాలను సరిచేసుకున్నవారు గెలుపుకు దగ్గరవుతారని సూచించాడు. తర్వాత వంట రాదన్న కీర్తితో ఆలూ ఫ్రై  చేయించుకుని మరీ తిన్నాడు నాగ్‌. అనంతరం ఇంటిసభ్యులతో ఫన్‌ గేమ్స్‌ ఆడించాడు. ఇకపోతే నామినేషన్స్‌లో అందరినీ సేవ్‌ చేసుకుంటూ రాగా చివరకు ఫైమా, రాజ్‌ ఇద్దరే మిగిలారు. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ రాజ్‌ కోసం వాడతానంది ఫైమా. అయితే రాజ్‌ మాత్రం నువ్వు ఆడి సంపాదించింది నీ కోసమే వాడుకో అని చెప్పాడు. దీంతో ఫైమా దాన్ని వాడకుండా వదిలేద్దామనకుంది.

కానీ నాగార్జున మాత్రం.. ఓటింగ్‌లో చివరి రెండు స్థానాల్లో మీ ఇద్దరే ఉన్నారని, మీలో ఒకరికి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వాడితే మిగతా ఒకరు ఎలిమినేట్‌ అవుతారని స్పష్టం చేశాడు. అంటే ఓటింగ్‌తో సంబంధం లేకుండా పాస్‌తో గండం గట్టెక్కొచ్చని నొక్కి చెప్పాడు. దీంతో ఫైమా మనసు మార్చుకుని తనకోసం ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వాడింది. ఫలితంగా ఎలిమినేషన్‌ నుంచి సేవ్‌ అయింది. అయితే ఆడియన్స్‌ ఓట్ల ప్రకారం చివరి స్థానంలో ఉన్న ఫైమా ఎలిమినేట్‌ అవ్వాలని, కానీ పాస్‌ సాయంతో ఆమె సేవ్‌ అయి రాజ్‌ ఎలిమినేట్‌ అయ్యాడని ప్రకటించాడు నాగ్‌. దీంతో ఫైమా, ఇనయ ఎమోషనలయ్యారు.

స్టేజీ మీదకు వచ్చిన రాజ్‌తో పంచ్‌, హగ్స్‌ గేమ్‌ ఆడించాడు నాగ్‌. ఫైమా, ఆది, రోహిత్‌, రేవంత్‌కు హగ్స్‌ ఇస్తానని, మిగతా నలుగురికి పంచ్‌ ఇచ్చాడు. వెళ్లేముందు కంటెస్టెంట్లకు విలువైన సూచనలిచ్చాడు రాజ్‌. ఫైమా దగ్గర కొంత ఫన్‌ తక్కువైందని, ఆదిరెడ్డి తను మాట్లాడిందే కరెక్ట్‌ అనుకుంటాడని, రోహిత్‌ కొన్ని సందర్భాల్లో మాట్లాడితే బాగుండన్నాడు. రేవంత్‌ది చిన్నపిల్లాడి మెంటాలిటీ అని, అతడు కచ్చితంగా టైటిల్‌ కొడతాడని ఫిక్సైపోమన్నాడు.

శ్రీహాన్‌ అందరితో గట్టిగా మాట్లాడతాడు, కానీ ఫ్రెండ్స్‌ తప్పులను గట్టిగా చెప్తే బాగుండన్నాడు. శ్రీసత్యను నామినేషన్‌లో సరైన పాయింట్లు చెప్పమన్నాడు. ఇనయను టాప్‌ 5లో చూడాలనుకుంటున్నానని, ఆలోచించి మాట్లాడమని సూచించాడు. హౌస్‌లో కీర్తి తనకెప్పుడూ కనిపించలేదంటూ ఆమె పరువు తీశాడు. ఫైనల్‌గా రాజు ఎక్కడైనా రాజే అంటూ అతడిని పంపించేశాడు నాగ్‌.

చదవండి: రాజశేఖర్‌ ఎలిమినేషన్‌కు కారణాలివే!
నిజానికైతే ఫైమా ఎలిమినేట్‌ కావాల్సింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement