Bigg Boss 6 Telugu: రాజ్‌ ఎలిమినేషన్‌కు కారణాలివే!

Bigg Boss Telugu 6: Reasons For Raja Sekhar Elimination - Sakshi

మరో మూడు వారాల్లో బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌కు శుభం కార్డు పడనుంది. ఎవరు ఫినాలేకు చేరుకుంటారు? ఎవరు కప్పు కొడతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో 12 వారం ఎలిమినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వారం రేవంత్‌, కీర్తి మినహా మిగతా ఏడుగురు నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఫైమా, రాజశేఖర్‌ ఇద్దరూ చివరి రెండు స్థానాల్లో ఉండగా ఫైనల్‌గా రాజ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. అతడి గేమ్‌ చూసి రాజ్‌ కచ్చితంగా టాప్‌ 5లో ఉంటాడనుకున్నారు, కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాజ్‌ బయటకు వచ్చేశాడు. ఇంతకీ రాజ్‌ ఎలిమినేషన్‌కు కారణాలేంటో చూద్దాం..

ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లో అడుగుపెట్టిన వ్యక్తి రాజ్‌. మాటల్లో తడబాటు, ఆటలో వెనకబడటం చూసి అతడు త్వరలోనే ఎలిమినేట్‌ అవుతాడనుకున్నారంతా! కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ తన గ్రాఫ్‌ను నెమ్మదిగా పెంచుకుంటూ వచ్చాడు. మాటల్లో, ఆటల్లో టఫ్‌ కాంపిటీషన్‌ ఇస్తూ ముందుకు సాగాడు. తనను చూసి నవ్వినవారితోనే చప్పట్లు కొట్టించుకున్నాడు.

అయితే మొదటినుంచీ తనకంటూ ఫ్యాన్‌ బేస్‌ లేకపోవడం రాజ్‌కు పెద్ద మైనస్‌గా మారింది. వారాలు గడిచేకొద్దీ కంటెస్టెంట్ల మధ్య పోటీ ఎక్కువవుతూ వస్తుంది. అలాంటి సమయంలో హౌస్‌మేట్స్‌ గేమ్‌ కంటే కూడా బయట వారి అభిమానులు వేసే ఓట్లే కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడున్నవారిలో అందరికంటే తక్కువ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది రాజ్‌కే! పైగా తనకెలాంటి పీఆర్‌టీమ్‌ కూడా లేకపోవడంతో ఓట్లు పెద్దగా పడలేదు.

మూడు వారాలుగా రాజ్‌ నామినేషన్‌లోకి రాలేదు. ఇది కూడా ఓట్లు పడకపోవడానికి ఒక ప్రధాన కారణం. మొదటి నుంచీ సోలో ప్లేయర్‌గా ఆడకుండా ఎవరో ఒకరి పక్కన నీడలా ఉండటం కూడా జనాలకు పెద్దగా నచ్చలేదు. హౌస్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే రాజ్‌ కన్నింగ్‌, చీటింగ్‌ ప్లేయర్‌ కాదు కానీ కొంత సేఫ్‌గా ఆడేవాడు. అప్పుడప్పుడూ స్మార్ట్‌గా కూడా ఆడేవాడు. కరెక్ట్‌ పాయింట్‌ మాట్లాడుతూ ఆదిరెడ్డి నోటికే తాళం వేసేవాడు. కాకపోతే చాలావరకు మాటల్లో కాన్ఫిడెన్స్‌, క్లారిటీ తక్కువగా ఉండేది. దీనివల్ల అతడు మిగతావారికంటే వీక్‌ అన్నట్లుగా కనిపించింది.

చివరగా ఈవారం ఫైమాకు తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ ఆమె ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వాడటంతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న రాజ్‌ను ఎలిమినేట్‌ చేశారు. అంటే ప్రేక్షకుల ఓట్లతో కాకుండా బిగ్‌బాస్‌ నిర్ణయంతోనే అతడకు బయటకు వచ్చేశాడన్నమాట!

చదవండి: మరోసారి తాతైన బ్రహ్మానందం
ఆ పని చేసుండకపోతే ఫైమా ఎలిమినేట్‌ అయ్యేది!

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

28-11-2022
Nov 28, 2022, 21:37 IST
విక్షన్‌ ఫ్రీ పాస్‌ వాడి సేవ్‌ అవడంతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న రాజ్‌ను అన్యాయంగా ఎలిమినేట్‌ చేశారు....
28-11-2022
Nov 28, 2022, 19:09 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండాలంటే ఆడాలి, మాట్లాడాలి.. ఈ రెండూ జరగకుండానే ఇన్నివారాలదాకా వచ్చావు. అంటే నువ్వు నక్క తోక తొక్కి...
28-11-2022
Nov 28, 2022, 17:50 IST
ముందు నుంచీ తనే నోరుజారుతున్నా అది ఎందుకు ఎవరికీ కనిపించట్లేదని భగ్గుమంది. కరెక్ట్‌ పాయింట్లు లాగడంతో రేవంత్‌ దెబ్బకు సైలెంట్‌...
28-11-2022
Nov 28, 2022, 15:55 IST
అంతా అయిపోయాక ఎవ్వరైనా మాట్లాడతారని ఆదిరెడ్డి పెదవి విరవడంతో అది మినిమమ్‌ కామన్‌సెన్స్‌ అన్నా, నేనైతే రూపాయి కూడా రాసేవాడిని...
27-11-2022
Nov 27, 2022, 23:21 IST
ఓటింగ్‌లో చివరి రెండు స్థానాల్లో మీ ఇద్దరే ఉన్నారని, మీలో ఒకరికి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వాడితే మిగతా ఒకరు ఎలిమినేట్‌...
27-11-2022
Nov 27, 2022, 16:35 IST
మీ అమ్మ చెప్పిన మాట గుర్తు తెచ్చుకో అంటూ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె భయపడిపోయి చివరి నిమిషంలో...
27-11-2022
Nov 27, 2022, 15:46 IST
శ్రీసత్య..  శ్రీహాన్‌ గేమ్‌ కన్నా ఫ్రెండ్‌షిప్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని, అది తనలో ఉన్న చెడు లక్షణమని పేర్కొంది.
26-11-2022
Nov 26, 2022, 23:09 IST
ఐదేళ్లు నేను ఖాళీగా ఉన్నసమయంలో మా కుటుంబమంతా చెల్లెలు పెన్షన్‌తో బతికాం అని చెప్పాడు.
26-11-2022
Nov 26, 2022, 18:49 IST
బిగ్‌బాస్‌ వీకెండ్‌లో మిగతా ఇంటిసభ్యులను, ఫ్రెండ్స్‌ను స్టేజీపైకి రప్పించి వారిని సర్‌ప్రైజ్‌ చేయనున్నాడు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో...
26-11-2022
Nov 26, 2022, 15:49 IST
ఒకవేళ నాగార్జున ఫైమాను ముందే సేవ్‌ చేసేస్తే చివరగా మిగిలిన ఇద్దరిలో ఒకరిని కాపాడేందుకు ఆ పాస్‌ వాడే ఆస్కారం...
25-11-2022
Nov 25, 2022, 23:29 IST
ఫైమా మట్టి తినడంతో బిగ్‌బాస్‌ ఆమెతో పని మాన్పించేందుకు ప్రయత్నించాడు. మీ రేషన్‌ మీరు వెతుక్కున్నారు కాబట్టి ఇంట్లో రేషన్‌...
25-11-2022
Nov 25, 2022, 18:35 IST
పోటాపోటీగా ఆడి చివరి కెప్టెన్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో లీకైంది. ఈ విషయం తెలిసి ఇనయ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు....
25-11-2022
Nov 25, 2022, 17:05 IST
శ్రీసత్యకు దండం పెట్టాలి. ఆమె ఎలిమినేట్‌ అయిపోతుందని ఎన్నోసార్లు అనుకున్నాను. ఆదిరెడ్డి రివ్యూలు ఇవ్వడం తగ్గించుకుంటే మంచిదని అభిప్రాయపడింది. తన...
25-11-2022
Nov 25, 2022, 15:33 IST
తడి నిరీక్షణకు తెరదించాడు బిగ్‌బాస్‌. భార్యతో వీడియోకాల్‌ ఆప్షన్‌ ఇవ్వడమే కాకుండా తల్లిని ఇంట్లోకి పంపించి సర్‌ప్రైజ్‌ చేశాడు.
24-11-2022
Nov 24, 2022, 23:06 IST
ఈ పదేళ్లు నా వెనకుండి నువ్వెలా నడిపించావో, భవిష్యత్తు అంతా కూడా నువ్వ నాతోనే ఉండాలంటూ తన పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నానని...
24-11-2022
Nov 24, 2022, 16:23 IST
'జీవితంలో చాలా కోల్పోయావు, ఆ దేవుడు నీ నుంచి ఎన్నో తీసేసుకున్నాడు. కానీ అదే దేవుడు నీకు మళ్లీ ఇంకో...
24-11-2022
Nov 24, 2022, 15:27 IST
హౌస్‌లోకి వచ్చిన సిరిని చూసి ఏడుస్తూనే కన్ను కొట్టాడు శ్రీహాన్‌. నీకోసం ఓ సర్‌ప్రైజ్‌ అంటూ వెనక్కు తిరిగి మెడ...
23-11-2022
Nov 23, 2022, 23:35 IST
ఫిజియోథెరపీ ఆపేశారు. ఎవరూ సాయం చేయట్లేదని అర్థమైంది. వాళ్ల దగ్గర తినడానికి సరిపడా డబ్బులున్నాయి. కానీ చికిత్సకు సరిపేడంత లేవు అని ఏడ్చింది. అనంతరం...
23-11-2022
Nov 23, 2022, 20:19 IST
షోలోకి వెళ్లకముందే వాళ్ల అమ్మకి చీర కొనిచ్చి దాన్ని కట్టుకురమ్మని చెప్పింది. సడన్‌ ఎలిమినేషన్‌ మేమంతా కూడా ఎక్స్‌పెక్ట్‌ చేయలేకపోయాం....
23-11-2022
Nov 23, 2022, 19:26 IST
'కొన్ని సంతోషకరమైన క్షణాలను మాటల్లో చెప్పలేం. ఈ ఆనందం కలకాలం అలాగే నిలిచిపోతుందని భావిస్తున్నాను' అని క్యాప్షన్‌ జోడించాడు..

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top