Bigg Boss 6 Telugu: Is Neha Chowdary Eliminated Instead of Inaya Sultana - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: చివరి నిమిషంలో సేవ్‌ అయి ఎలిమినేషన్‌ నుంచి గట్టెక్కింది తనే

Sep 25 2022 10:51 AM | Updated on Sep 25 2022 12:11 PM

Bigg Boss 6 Telugu: Is Neha Chowdary EliminatedI Insted Of Inaya - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6 రసవత్తరంగా ముందుకు సాగుతుంది. తొలి రెండు వారాలు చప్పగా సాగిన ఈ షో.. మూడో వారంలో వచ్చేసరికి మాత్రం రసవత్తరంగా మారింది. నామినేషన్స్‌ మొదలు.. కెప్టెన్సీ టాస్క్‌ వరకు ఇంటి సభ్యులు గొడవపడుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగా గతవారం డబుల్‌ ఎలిమినేషన్‌తో షానీ, అభినయలు హౌస్‌ నుంచి బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్న విషయంలో ఆసక్తి మొదలైంది.

మూడోవారంలో వాసంతీ కృష్ణన్‌, బాలాదిత్య, చలాకీ చంటి, ఆరోహి, నేహా చౌదరి,ఇనయా సుల్తానా, శ్రీహాన్‌, రేవంత్‌, గీతూ రాయల్‌ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో రేవంత్‌, గీతూ తమ ఆటతీరుతో ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నారు. ఇక ఆరోహి, నేహా, ఇనయాలు డేంజర్‌ డోన్‌లో ఉండగా ఇనయా ఎలిమినేట్‌ అవుతుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా నేహా చౌదరి ఎలిమినేట్‌ అయిందని ఇప్పటికే లీకువీరులు లీక్‌ చేశారు.

అర్థంపర్థం లేని రాద్దాంతం చేస్తూ చీటికిమాటికి గొడవపడుతూ ఇనయా బాగానే కంటెంట్‌ ఇచ్చింది. దీంతో చివరి నిమిషంలో ఆమె సేవ్‌ అయి నేహా చౌదరి ఎలిమినేట్‌ అయిందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాలంటే ఎపిసోడ్‌ వచ్చేవరకు వేచిచూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement