లెక్క తేలింది, విన్నర్‌ గెలుచుకునే ప్రైజ్‌మనీ ఎంతంటే? | Bigg Boss 6 Telugu: This is the Final Prize Money of Winner | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: జీవించిన హౌస్‌మేట్స్‌.. మెచ్చిన బిగ్‌బాస్‌, ఫైనల్‌ ప్రైజ్‌మనీ ఎంతంటే?

Dec 9 2022 11:43 PM | Updated on Dec 10 2022 7:28 AM

Bigg Boss 6 Telugu: This is the Final Prize Money of Winner - Sakshi

ఆ కోల్పోయిన డబ్బు తిరిగి పొందేందుకు అవకాశాలిస్తూ పోయాడు. నేటితో ఆ ఛాన్స్‌లకు తెరదించాడు. ఫైనల్‌ ప్రైజ్‌మనీని ప్రకటించాడు.

Bigg Boss 6 Telugu, Episode 97: బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో  ప్రైజ్‌మనీ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. గతంలో దాన్ని కత్తిరించుకుంటూ పోయిన బిగ్‌బాస్‌ ఈ వారం ఆ కోల్పోయిన డబ్బు తిరిగి పొందేందుకు అవకాశాలిస్తూ పోయాడు. నేటితో ఆ ఛాన్స్‌లకు తెరదించాడు. ఫైనల్‌ ప్రైజ్‌మనీని ప్రకటించాడు. మరి ఆ అమౌంట్‌ ఎంతో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయాల్సిందే!

రెండు రోజులగా దెయ్యం టాస్కుతో ఇంటిసభ్యులను హడలెత్తిస్తున్నాడు బిగ్‌బాస్‌. ఈరోజు శ్రీసత్య, కీర్తిలను చీకటి గదిలోకి పంపించాడు. వీళ్లిద్దరూ గడ్డిని చూసి కూడా గజగజ వణికిపోయారు చివరికి బిగ్‌బాస్‌ చెప్పిన వస్తువులు తీసుకురావడంతో రూ.20 వేలు ఇచ్చాడు. తర్వాత రోహిత్‌ను ఆ తర్వాత హౌస్‌మేట్స్‌ అందరినీ చీకటి గదిలో వేశారు. అక్కడ ఇనయ, కీర్తి దెయ్యాల్లా భయపెడుతూ అందరినీ ఓ ఆటాడుకున్నారు. ఈసారి ఇంటిసభ్యులు మరో రూ.13వేలు గెలిచారు. మనీబాల్‌ టాస్క్‌లో రేవంత్‌ రూ.500, రోహిత్‌ రూ.1500 సాధించాడు.

అనంతరం ఆరో సీజన్‌లోని ఐకానిక్‌ సంఘటనలను మరోసారి ప్రదర్శించి ఎంటర్‌టైన్‌ చేయాలన్నాడు బిగ్‌బాస్‌. ఈ క్రమంలో ఇనయ- శ్రీహాన్‌ల పిట్ట కథ, హోటల్‌ టాస్క్‌లో శ్రీసత్య- అర్జున్‌ ఒప్పందం, అర్జున్‌-రేవంత్‌ పప్పు గొడవ, మిషన్‌  పాజిబుల్‌ టాస్క్‌లోని ఆదిరెడ్డి సీక్రెట్‌ టాస్క్‌(బాత్రూమ్‌ను అశుభ్రపరిచి గొడవ చేసిన గొడవ), కీర్తి వేలు గాయపడ్డ సంఘటన, కెప్టెన్సీ టాస్క్‌లో రోహిత్‌ గోనె సంచులను తన్నిన సీన్‌.. వీటన్నింటినీ మరోసారి కళ్లకు కట్టినట్లు చూపించారు.

అందరూ నటించడం కాదు ఏకంగా జీవించేశారు. వీరి యాక్టింగ్‌ స్కిల్స్‌తో బిగ్‌బాస్‌ను అలరించి రూ.43,000 గెలుచుకున్నారు. అన్ని ఛాలెంజ్‌లు, టాస్కులు పూర్తైన తర్వాత ఫైనల్‌గా విన్నర్‌ ప్రైజ్‌మనీ రూ.47,00,000కి చేరింది. ఈ సంతోషంలో రేవంత్‌ పాట పాడగా కీర్తి, శ్రీసత్య డ్యాన్సులేశారు.

చదవండి: ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌?
ఫైమాకు గోల్డెన్‌ ఛాన్స్‌ ఇచ్చిన పటాస్‌ ప్రవీణ్‌

Advertisement
 
Advertisement
Advertisement