గీతూ చేసిన పనికి ఆదిరెడ్డిని శిక్షించిన బిగ్‌బాస్‌! | Bigg Boss 6 Telugu: BB Punishment To Adi Reddy | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: గీతూ వల్ల ఆదిరెడ్డి గేమ్‌ ఖతం, అంతా చేసి సారీ అంటూ...

Nov 4 2022 7:04 PM | Updated on Nov 4 2022 7:04 PM

Bigg Boss 6 Telugu: BB Punishment To Adi Reddy - Sakshi

ఆదిరెడ్డి ఆవేశంలో మైక్‌ విసిరేసినందుకు వారం అతడిని కెప్టెన్సీ టాస్క్‌కు అనర్హుడిగా ప్రకటించాడు బిగ్‌బాస్‌. 

ఆకు వచ్చి ముళ్లు మీద పడ్డా, ముళ్లొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే.. ఈ సామెత ప్రస్తుతం ఆదిరెడ్డికి బాగా సెట్టయింది. గీతక్క గీతక్క అంటూ ఆమెను నమ్మినందుకు గేమ్‌లో వెన్నుపోటు పొడిచింది. ఆల్‌రెడీ తను అవుట్‌ అయినా సరే గేమ్‌ ఆడి ఆదికి కోపం తెప్పించి అతడు కూడా గేమ్‌లో లేకుండా చేసింది. ఆదిరెడ్డి ఆవేశంలో మైక్‌ విసిరేసినందుకు వారం అతడిని కెప్టెన్సీ టాస్క్‌కు అనర్హుడిగా ప్రకటించాడు బిగ్‌బాస్‌.

చేసిందంతా చేశాక కాళ్లబేరానికి వచ్చింది గీతూ. ఆది దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. నువ్వు చెప్పిన రూల్‌ నువ్వే ఫాలో కాలేదు, నీ వల్ల నేను చచ్చిపోయాను అని బాధపడ్డాడు ఆది.
అనంతరం మెరీనా, వాసంతి, ఫైమా, గీతూ, సత్య, ఇనయ కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. బెలూన్లు కాపాడుకునే టాస్క్‌లో శ్రీసత్య గెలిచి కెప్టెన్‌గా అవతరించింది.

చదవండి: గీతక్కా, నీకు కన్నీళ్లు తెప్పిస్తా, చూడు..: ఉడాల్‌ మామ వార్నింగ్‌
ఆ హీరోతో ఒక్క సినిమా కూడా చేయని టబు

Advertisement
 
Advertisement
Advertisement