Bigg Boss Telugu 5: మాన‌స్ కోసం కొట్టుకుంటున్న ముగ్గురు, ఎవ‌రో తెలుసా?

Bigg Boss 5 Telugu: Priyanka Singh Jealous Again About Maanas - Sakshi

Bigg Boss Telugu 5, Episode 40: దొంగ‌త‌నాలు, కొట్లాట‌లు, గుంజుకోవ‌డాలు, అరుచుకోవ‌డాల మ‌ధ్య ఎట్ట‌కేల‌కు బొమ్మ‌ల కొలువు టాస్క్ ముసిగింది. ఏ టీమ్ ఎన్ని బొమ్మ‌లు చేసిందో చెప్పాల‌ని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఈ క్ర‌మంలో కాజ‌ల్ మ‌రోసారి కౌంటింగ్ మొద‌లు పెట్ట‌గా మొద‌టి నుంచి కౌంటింగ్ అవ‌స‌రం లేదంటూ గొడ‌వ‌కు దిగింది సిరి. సంచాల‌కురాలిగా నీ ప‌వ‌ర్‌ను వృధా చేస్తున్నావ‌ని కాజ‌ల్‌ను హెచ్చ‌రించాడు ర‌వి. అయిన‌ప్ప‌టికీ ఆమె మాత్రం త‌న నిర్ణ‌యానికి తిరుగులేదు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించింది. మ‌రోసారి లెక్కించి రెడ్ టీమ్ ద‌గ్గ‌ర 17, గ్రీన్ టీమ్ 24 ఉన్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో సిరి కూడా ఇక త‌ప్ప‌ద‌న్న‌ట్లుగా మ‌రోసారి లెక్క‌పెట్టి బ్లూ టీమ్ 17, ఎల్లో టీమ్ 14 బొమ్మ‌లు చేసిన‌ట్లు తెలిపింది.

సిరి క‌న్నీరు, ఓదార్చిన ష‌ణ్ముఖ్‌
అయితే రెడ్ టీమ్‌ త‌మ‌కు ల‌భించిన స్పెష‌ల్ బొమ్మ ద్వారా ఎల్లో టీమ్‌లోని స‌గం బొమ్మ‌ల‌ను చెత్త బుట్ట‌లో ప‌డేసింది. అనంత‌రం బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ మీద గ‌ర‌మ‌య్యాడు. శ్వేత‌, లోబో  బిగ్‌బాస్ ఇంట్లోని కుష‌న్స్‌ను క‌ట్ చేసి అందులోని దూది తీసి పాడు చేశార‌ని ఆగ్ర‌హించాడు, సంచాల‌కులైన కాజ‌ల్‌, సిరి దీన్ని అడ్డుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని పేర్కొంటూ వారిని కెప్టెన్సీ కంటెండ‌ర్స్ టాస్క్‌లో అన‌ర్హులుగా ప్ర‌క‌టించారు. దీంతో కెప్టెన్‌ అయ్యే ఛాన్స్ పోయిందేన‌ని సిరి క‌న్నీరుపెట్టుకోగా ష‌ణ్ముఖ్ ఆమెను ఓదార్చాడు. కెప్టెన్సీకి పోటీప‌డేందుకు అర్హ‌త సాధించిన సంతోషంలో బ్లూ టీమ్‌లోని మాన‌స్ యానీ మాస్ట‌ర్‌ను ఎత్తుకుని తిప్పాడు.

నీ మీదున్న ప్రేమ కంటే మాన‌స్ మీదే ఎక్కువ ప్రేమ
నీకు నీ మీదున్న ప్రేమ కంటే మాన‌స్ మీదే ఎక్కువ ప్రేమ ఉన్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని ప్రియాంక గురించి ఆమెతోనే చెప్పుకొచ్చింది కాజ‌ల్‌. మాన‌స్ కోసం ఎక్కువ కేర్ తీసుకుంటున్న‌ట్లు అనిపిస్తోంద‌ని చెప్పింది. దీంతో ఆలోచ‌న‌లో ప‌డిన పింకీ.. మానస్ విష‌యంలో త‌ను చేస్తోంది త‌ప్పా? అని అడిగింది. దానికి కాజ‌ల్ త‌ప్పేం కాద‌ని ఆన్స‌రిచ్చింది. ఇక విశ్వ సెల్ఫిష్ అని, అటెన్ష‌న్ సీక‌ర్ అని అభిప్రాయ‌ప‌డింది ప్రియ‌.

మాన‌స్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు:  ష‌ణ్ముఖ్‌
ప్రియాంక‌కు గెలుపు పాఠాలు నేర్పిన జెస్సీ మీద ఫైర్ అయ్యాడు ష‌ణ్ముఖ్‌. మిగ‌తావాళ్ల‌కు ఎలాంటి స‌ల‌హాలు ఇవ్వొద్ద‌ని నొక్కి చెప్తూ జెస్సీకి ఉచిత స‌ల‌హా ఇచ్చాడు. అయితే ఇది ఇద్ద‌రికీ(జెస్సీ, ష‌ణ్ను) వ‌ర్తిస్తుంద‌ని కౌంట‌రిచ్చింది సిరి. మేము చెప్తే అస‌లు విన‌దు ఈ పుడుంగి, పెద్ద చెప్ప‌డానికి వ‌చ్చింది అంటూ ఆమె మీద కౌంట‌రేశాడు ష‌ణ్ను. దీంతో హ‌ర్ట‌యిన సిరి అక్క‌డ నుంచి వెళ్లిపోయింది. దీంతో త‌న‌ను ర‌మ్మ‌ని పిలువురా అంటూ జెస్సీని రాయ‌బారం కోరాడు ష‌ణ్ను. అందుకు జెస్సీ నో చెప్ప‌డంతో చేసేదేం లేక అత‌డే స్వ‌యంగా వెళ్లి సారీ చెప్పి ఆమె కోపాన్ని చ‌ల్లార్చాడు. ఇక‌ స‌న్నీ వ‌ల్ల మాన‌స్ లాభ‌ప‌డుతున్నాడ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు ష‌ణ్ను. మాన‌స్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడ‌ని పేర్కొన్నాడు.

పింకీని గెలిపించిన మాన‌స్‌, స‌న్నీ
మ‌రోవైపు కాజ‌ల్‌.. నీ కోసం ముగ్గురు కొట్టుకుంటున్నార‌ని మాన‌స్‌తో ముచ్చ‌ట్లు పెట్టింది. పింకీతోపాటు ప్రియ నీ విష‌యంలో పొజెసివ్ అనిపిస్తుంద‌ని చెప్పుకొచ్చింది, కానీ మూడో వ్య‌క్తి ఎవ‌ర‌న్న‌ది మాత్రం బ‌య‌ట‌పెట్ట‌లేదు. అనంత‌రం రెడ్, బ్లూ టీమ్‌లోని ప్రియాంక సింగ్‌, యానీ మాస్ట‌ర్‌, ప్రియ‌, మాన‌స్‌, స‌న్నీ, విశ్వ‌ల‌కు ఇసుక‌తో ఆట ఈజీ కాదు బేటా అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ గేమ్‌లో విశ్వ విజేత‌గా నిలిచి హౌస్‌కు కెప్టెన్‌గా అవ‌త‌రించాడు. ష‌న్ మేనేజ‌ర్ పోస్టు కోసం పోటీప‌డ్డ మాన‌స్‌, ప్రియాంక‌, స‌న్నీల‌కు డ‌బ్బాల ధ‌మాకా అనే టాస్క్ ఇచ్చాడు. అయితే స‌న్నీని గెల‌వ‌ద్ద‌ని అత‌డి కాళ్ల మీద ప‌డినంత ప‌ని చేశాడు విశ్వ‌. దీంతో అత‌డి అభ్య‌ర్థ‌న‌కు ఓకే చెప్పి ఆట‌ను తూతూమంత్రంగా కానిచ్చాడు. మొత్తానికి ఇందులో ఎక్కువ క్యారేజీల‌ను స‌రిగా అమ‌ర్చి పింకీ గెలిచింది, కాదు మిగ‌తా ఇద్ద‌రు గెలిపించారు.

నీకు మాన‌స్ అన్న‌య్య అవుతాడు: పింకీ
అర్ధ‌రాత్రి దుప్ప‌టి క‌ప్పుకుని ప‌డుకున్న మాన‌స్‌కు నుదుట‌న బొట్టు పెట్టేసింది పింకీ. ఇది చూసి అక్క‌డున్న‌వాళ్లంతా షాక‌య్యారు. పింకీ మ‌న‌సులోని భావాల‌ను పాట‌ల రూపంలో బ‌య‌ట‌పెట్టారు. మాన‌స్ క్యూట్ ఉంటాడంటూ పింకీని మ‌రింత ఉడికించింది సిరి, అయితే అత‌డి వైపు క‌న్నెత్తి చూడ‌గానే ఆమెను కింద‌కు నెట్టేసి ప‌డుకోమ‌ని హెచ్చ‌రించింది పింకీ. నీకు మాన‌స్ అన్న‌య్య అవుతాడ‌ని చెప్ప‌గా సిరి మాత్రం.. కానే కాద‌ని, త‌ను నా ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top