బిగ్‌బాస్‌ 5: ఆపరేషన్‌ విషయం తండ్రికి తెలీదన్న ట్రాన్స్‌జెండర్‌ | Bigg Boss 5 Telugu: Priyanka Singh Entered As 9th Contestant In House | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: తొమ్మిదో కంటెస్టెంట్‌గా ప్రియాంక సింగ్‌

Sep 5 2021 8:08 PM | Updated on Dec 19 2021 11:40 PM

Bigg Boss 5 Telugu: Priyanka Singh Entered As 9th Contestant In House - Sakshi

Priyanka Singh In Bigg Boss 5 Telugu: జబర్దస్త్‌ షోలో లేడీ గెటప్‌తో ప్రేక్షకులకు చేరువయ్యాడు సాయితేజ. ఇందులో చీరకట్టి గాజులేసుకునే సాయితేజ తర్వాత ఆపరేషన్‌ చేసుకుని నిజంగానే అమ్మాయిగా మారిపోయాడు. ప్రియాంక సింగ్‌గా పేరు మార్చుకుని అతడు కాస్తా ఆమెగా రూపాంతరం చెందాడు. అయితే నేనిలా జెండర్‌ మార్చుకున్నానన్న విషయం తన తండ్రి బీబీ సింగ్‌కు ఇప్పటికీ తెలీదని పేర్కొంది.

'నా కోరిక కొద్దీ నేనొక అమ్మాయిగా మారినా, నీకు ఎప్పటికీ కొడుకునే, అమ్మానాన్న ఇద్దరూ తల దించుకునే పని ఎప్పుడూ చేయను' అని చెప్తూ స్టేజీ మీద ఎమోషనల్‌ అయింది. శ్రీకాకుళానికి చెందిన ప్రియాంక సింగ్‌ హౌస్‌లో తొమ్మిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ ట్రాన్స్‌జెండర్‌ హౌస్‌లో ఎలా ఉండబోతుంది? అందరితో కలిసిపోతుందా? అన్నది మున్ముందు రోజుల్లో తేలనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement