బిగ్‌బాస్‌ 5: ఆ స్టార్‌ సింగర్‌ ఎంట్రీ ఫిక్స్‌! | Bigg Boss 5 Telugu: Indian Idol Winner Sreerama Chandra May Enter Into House | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: హౌస్‌లోకి ఆ టాప్‌ సింగర్‌!

Aug 30 2021 9:07 AM | Updated on Oct 18 2021 1:32 PM

Bigg Boss 5 Telugu: Indian Idol Winner Sreerama Chandra May Enter Into House - Sakshi

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ కోసం రంగం సిద్ధమైంది. ఇప్పటికే హౌస్‌ సెట్టింగ్‌ పూర్తవగా ప్రేక్షకులను అలర్ట్‌ చేస్తూ ప్రోమో కూడా రిలీజైన విషయం తెలిసిందే. మరోపక్క కంటెస్టెంట్ల ఎంపిక కూడా దాదాపు పూర్తయినట్లే తెలుస్తోంది. ఈ మేరకు కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలువురి పేర్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారిలో యాంకర్‌ రవి, విశ్వ, సరయూ, కొరియోగ్రాఫర్‌ నటరాజ్‌, యానీ మాస్టర్‌, లోబో, మానస్‌, ఉమా దేవి, జశ్వంత్‌, ట్రాన్స్‌జెండర్‌ ప్రియాంక, వీజే సన్నీ, ఆర్జే కాజల్‌, షణ్ముఖ్‌ జస్వంత్‌, ప్రియ, వర్షిణి, లహరి శ్రీ ఉన్నారు. ఈ లిస్టులో మార్పుచేర్పులు ఉండే అవకాశమూ లేకపోలేదు.

ఇక ప్రతి సీజన్‌లో ఒక సింగర్‌ ఉన్నట్లే ఈసారి కూడా హౌస్‌లో ఒక సింగర్‌ ఉండాలని బిగ్‌బాస్‌ నిర్వాహకులు డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. ఇందుకోసం స్టార్‌ సింగర్‌ శ్రీరామచంద్రను షోలోకి రప్పిస్తున్నారని సమాచారం. 2010లో ఇండియన్‌ ఐడల్‌ టైటిల్‌ గెలుచుకున్న శ్రీరామచంద్ర పాటలు పాడటంతో పాటు, పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. అతడు గనక షోలోకి వస్తే పాట, నటనతో పాటు ఆటతోనూ మనసులు గెలుచుకుంటాడని అంటున్నారు ఆయన అభిమానులు.

గత సీజన్లలో సింగర్లు గీతా మాధురి, రాహుల్‌ సిప్లిగంజ్‌ అభిమానులను ఎంతగా అలరించారో రామచంద్ర కూడా అదేస్థాయిలో ఆకట్టుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే ఈ గాయకుడు షోలో అడుగు పెట్టబోతున్నాడా? ఒకవేళ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తే తన గాత్రంతో బిగ్‌బాస్‌ వీక్షకుల మనసు దోచుకోనున్నాడా? అనేది తెలియాలంటే మరో కొద్దిరోజులు కాగాల్సిందే!

Advertisement
 
Advertisement
Advertisement