బిగ్‌బాస్‌: నాలుగోవారం నామినేషన్స్‌లో ఎనిమిది మంది! | Bigg Boss 5 Telugu: 4th Week Nominations Contestants List Leak | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది!

Sep 27 2021 5:51 PM | Updated on Sep 27 2021 9:54 PM

Bigg Boss 5 Telugu: 4th Week Nominations Contestants List Leak - Sakshi

దీనికి సంబంధించిన షూటింగ్‌ నిన్ననే పూర్తి కావడంతో ఈవారం ఎనిమిది మంది నామినేట్‌ అయ్యారంటూ తాజాగా ఓ లిస్టు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది...

'బిగ్‌బాస్‌లో అన్ని టాస్కుల యందు నామినేషన్‌ టాస్కు వేరయా!' అంటారు బుల్లితెర అభిమానులు. ఎందుకంటే అప్పుడే కదా కంటెస్టెంట్లు కొట్టుకునేది, తిట్టుకునేది, అరుచుకునేది.. ఆ సమయంలోనే కదా వారి నిజస్వరూపాలేంటో తెలుసుకునేది! అందుకనే బిగ్‌బాస్‌ వీక్షకులకు మండే వచ్చిందంటే చాలు పండగే! 

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ చూస్తుండగానే మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు సరయు, ఉమాదేవి, లహరి షారి వరుసగా ఎలిమినేట్‌ అయ్యారు. తాజాగా నాలుగో కంటెస్టెంట్‌ను బయటకు పంపిచేందుకు నామినేషన్స్‌ జరగనున్నాయి. అయితే ఈ నామినేషన్ల పర్వానికి సంబంధించిన షూటింగ్‌ నిన్ననే పూర్తి కావడంతో ఈవారం ఎనిమిది మంది నామినేట్‌ అయ్యారంటూ తాజాగా ఓ లిస్టు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లిస్టులో సిరి హన్మంత్‌, ప్రియ, యానీ మాస్టర్‌, ఆర్జే కాజల్‌, యాంకర్‌ రవి, వీజే సన్నీ, నటరాజ్‌ మాస్టర్‌ ఉన్నారు. మరి నాలుగోవారం నామినేషన్‌లో ఉన్నది ఈ 8 మందేనా? అన్నదానిపై స్పష్టత రావాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!

Advertisement
 
Advertisement
Advertisement