బిగ్‌బాస్‌: బోల్డ్ పాప మీద‌ సోహైల్ ప్ర‌తీకారం! | Bigg Boss 4 Telugu: Sohel Takes Revenge On Ariyana In Task | Sakshi
Sakshi News home page

అరియానాతో పెట్టుకుంటున్న సోహైల్‌

Dec 8 2020 3:51 PM | Updated on Dec 8 2020 4:11 PM

Bigg Boss 4 Telugu: Sohel Takes Revenge On Ariyana In Task - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప‌ద్నాలుగో వారంలో టికెట్ టు ఫినాలే విజేత అఖిల్ మిన‌హా అంద‌రూ నామినేష‌న్స్‌లో ఉన్నారు. మిమ్మ‌ల్ని మీరు నిరూపించుకోండంటూ వీరికి బిగ్‌బాస్ ఓ ప్ర‌త్యేక టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మొద‌టి లెవ‌ల్‌లో అధికారం అనే రాజారాణి టాస్క్ ఇచ్చాడు. సోహైల్ పాల‌న‌లో అరియానా రెచ్చిపోయి ఎంట‌ర్‌టైన్ చేయ‌గా అభిజిత్ అధికారంలో పెద్ద‌గా న‌వ్వులు పూయ‌లేదు. ఇక హారిక రాజ్యంలో అయితే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు బ‌దులు గొడ‌వ‌లే ఎక్కువ‌గా జ‌రిగాయి. ఇక నేడు జ‌ర‌గ‌బోయే రెండో లెవ‌ల్‌లో ఇంటి స‌భ్యుల స‌హ‌నాన్ని బిగ్‌బాస్ ప‌రీక్షించ‌నున్నాడు. ఎవ‌రెంత విసిగించినా, కోపం తెప్పించినా ఓపిక‌తో భ‌రించాల్సి ఉంటుంది. ఇందులో సోహైల్.. అరియానాకు ఎలాగైనా ఓపిక న‌శించేలా చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడు. ఎంత‌ వెక్కిరించినా ఆమెలో ఏ రియాక్ష‌న్ లేక‌పోవ‌డంతో చేత‌ల‌కు ప‌ని చెప్పాడు. (చ‌ద‌వండి: హారిక‌ను చుమ్మా ఇవ్వ‌మ‌ని బెదిరించిన అఖిల్‌)

ఆమెకు ఇష్ట‌మైన దుస్తుల‌ను తీసుకొచ్చి దాన్ని ముక్క‌లు ముక్క‌లుగా చేస్తున్న‌ట్లు చూపించారు. అయితే నువ్వు ఏమీ చేయ‌వ‌ని ఆమెకు తెలుసులే అని హారిక ఉన్న‌మాట చెప్ప‌డంతో సోహైల్‌కు కోపం వచ్చింది. త‌న చేతిలో ఉన్న క‌ప్పును ప‌గ‌ల‌గొట్టాడు. అదే ఆవేశంలో అరియానాకు ఎంతో ఇష్ట‌మైన బొమ్మ‌ను న‌లిపేస్తున్నాడు. అత‌డు చేసే ఒక్కో ప‌నికి అరియానా లోలోప‌ల ఉడికిపోతున్నా బ‌య‌ట‌కు మాత్రం అవేమీ క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతోంది. చూస్తుంటే అత‌డు మ‌హారాజుగా ఉన్న‌ప్పుడు అరియానా చేసిన గ‌డ‌స‌రి చేష్ట‌ల‌కు సోహైల్ ప్ర‌తీకారం తీర్చుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. వీట‌న్నింటినీ అరియానా లెక్క‌లోకి తీసుకుంటే మాత్రం టాస్క్ పూర్త‌య్యాక వాళ్లిద్ద‌రి మ‌ధ్య అగ్నిగుండం బ‌ద్ధ‌ల‌వడం ఖాయం. మ‌రి ఇంటి స‌భ్యులంద‌రిలో ఎవ‌రు ఎక్కువ స‌హ‌నశీలుర‌ని నిరూపించుకుంటారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేవ‌ర‌కు వేచి చూడాల్సిందే! (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఫినాలేకు అతిథిగా స్టార్‌ హీరో!)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement