బిగ్‌బాస్‌: వెళ్లిపోయేది ఆమె? అత‌డు?

Bigg Boss 4 Telugu: Safe And Danger Zone Contestants For 5th Week - Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో రోజులు గ‌డిచేకొద్దీ ఆట మీద ఫోక‌స్ పెరుగుతోంది. కానీ ఇదే క్ర‌మంలో కొంద‌రి ఫోక‌స్ మాత్రం వేరేవాళ్ల‌పై పెట్ట‌డంతో వారి గేమ్ ప‌ట్టాలు త‌ప్పుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఏదేమైనా ఇప్ప‌టికే బిగ్‌బాస్ ఇంట్లో చాలా మార్పులు వ‌చ్చాయి. సూర్య కిర‌ణ్‌, క‌రాటే క‌ల్యాణి, దేవి నాగ‌వ‌ల్లి, స్వాతి దీక్షిత్ వెళ్లిపోయారు. ఇక చూస్తుండ‌గానే ఐదోవారం ఎలిమినేష‌న్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. ఈ సారి నామినేష‌న్‌లో అభిజిత్‌, అఖిల్‌, మోనాల్‌, సోహైల్‌, లాస్య‌, అరియానా, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, నోయ‌ల్‌, సుజాత ఉన్నారు. వీరిలో ఎవ‌రు సేఫ్ జోన్‌లో ఉన్నారు? ఎవ‌రు డేంజ‌ర్ జోన్‌లోకి వ‌చ్చారో చ‌దివేయండి.

ఓటింగ్‌లే ఆ ఇద్ద‌రే టాప్‌
నామినేష‌న్‌లోకి త‌ర‌చూ వ‌స్తున్న కంటెస్టెంట్ల లిస్టులో అభిజిత్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. కానీ నామినేష‌న్‌లోకి వ‌చ్చిన ప్ర‌తిసారి అత‌డికే ఎక్కువ ఓట్లు ప‌డుతున్నాయి. ఓటింగ్ దాదాపు స‌గం వ‌ర‌కు ఓట్లు అభిజిత్‌కే గుద్దేస్తున్నారు. దీంతో ఎలిమినేష‌న్ గండం నుంచి సునాయాసంగా త‌ప్పించుకోగ‌లుగుతున్నాడు. ఈసారి కూడా అంద‌రి క‌న్నా ఎక్కువ ఓట్లు అత‌డికే రావ‌డంతో సేఫ్ జోన్‌లో అడుగుపెట్టాడు. త‌ర్వాత అఖిల్‌కు ఎక్కువ ఓట్లు రావ‌డంతో అత‌డు కూడా ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పించుకున్నాడు.

లాస్య‌కు ప్రేక్ష‌కుల ఫుల్ స‌పోర్ట్‌
లాస్య నామినేష‌న్‌లోకి వ‌చ్చినా అందుకు గ‌ల కార‌ణాన్ని ప్రేక్ష‌కులు అంగీక‌రించ‌లేదు. ఆమె చేసిన ప‌ప్పు కూర వ‌ల్ల ఇంటిస‌భ్యుల‌కు మోష‌న్స్ అవుతున్నాయ‌ని చెప్ప‌డం ప్రేక్ష‌కుల‌కు సిల్లీగా అనిపించింది. అంతేకాక దివి పాయింట్‌ను గంగ‌వ్వ తోపాటు కిచెన్‌లో ఉండే రాజ‌శేఖ‌ర్ కూడా వ్య‌తిరేకించారు. అలాగే జ‌నాలు కూడా లాస్య ఏ త‌ప్పూ చేయ‌నందున ఆమెకు స‌పోర్ట్ చేస్తూ ఓట్లు గుద్దేస్తున్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: మ‌ళ్లీ ఇంటికి పోతా అంటున్న గంగ‌వ్వ‌)

బాబాలా మ‌రిపోతున్న నోయల్ సేఫ్‌
నోయ‌ల్‌.. అంద‌రిమీద అభిప్రాయాన్ని రుద్ద‌డాన్ని త‌గ్గించుకోమ‌ని నాగ్ సూచించిన‌ప్ప‌టి నుంచి నోయ‌ల్ పూర్తిగా మారిపోయాడు. ఎదుటివారు కోపంగా మాట్లాడినా, చిరాకుతో చూసినా న‌వ్వుతూనే స‌మాధ‌న‌మిస్తున్నాడు. నోయ‌ల్ బాబాలా మార‌డంపై ఆయ‌న అభిమానులు క‌ల‌వ‌ర‌పాటుకు లోన‌వుతున్నారు. అయితే ఎవ‌రి మీద నోరు జార‌కుండా, అన‌వ‌స‌ర విష‌యాల్లో త‌ల‌దూర్చ‌నందుకు అత‌నికి కూడా బాగానే ఓట్లు వ‌చ్చి ప‌డ్డాయి. దీంతో నోయ‌ల్ మ‌ళ్లీ సేఫ్ అయిన‌ట్లు తెలుస్తోంది.

అరియానాకు అవ‌కావ‌మిస్తున్నారు
ముక్కుసూటిగా మాట్లాడే అరియానాకు షో ప్రారంభంలో పెద్ద‌గా అభిమానులు లేరు. కానీ ఆమె ఆట‌తీరు, ఉన్న‌దున్న‌ట్లు ముఖం మీద చెప్పే విధానం, ఎలాంటి సేఫ్ గేమ్ ఆడ‌క‌పోవ‌డం, టాస్క్‌లో శ‌క్తి మేర ప్ర‌య‌త్నించ‌డం వ‌ల్ల అంద‌రి దృష్టి ఆమె మీద ప‌డింది. పులిహోర క‌లిపేవాళ్ల‌కు కాకుండా ఇలా నిజ‌మైన గేమ్ ఆడేవాళ్ల‌కు అవ‌కాశ‌మిద్దామ‌ని ఆమెను ఎలిమినేట్ అవ‌కుండా కాపాడుతున్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: రీ ఎంట్రీ కోసం‌ స్వాతి ఫ్యాన్స్ ఆందోళ‌న‌)

ఆ సాంప్ర‌దాయం ప్ర‌కారం సోహైల్ కూడా సేఫ్‌
బిగ్‌బాస్ హౌస్‌లో ఓ సాంప్ర‌దాయం ఉంది. కెప్టెన్‌గా గెలిచిన కంటెస్టెంట్ ఎలిమినేట్ కారు. ఈ సాంప్ర‌దాయం కొన‌సాగితే సోహైల్ ఈ వారం ఎలిమినేష‌న్ నుంచి గ‌ట్టెక్కుతారు. గ‌త వారం కూడా కుమార్‌సాయి నామినేష‌న్‌లో ఉన్న‌ప్ప‌టికీ కెప్టెన్‌గా గెలిచినందున ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పించుకున్నారు. కాబ‌ట్టి ఈసారి కూడా సోహైల్ విష‌యంలో దాదాపు అదే జ‌ర‌గ‌నుంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: సుజాత‌పై ప‌గ ప‌ట్టిన నెటిజ‌న్లు)

డేంజ‌ర్ జోన్‌లో మాస్ట‌ర్‌, సుజాత‌
మిగిలిన ఇద్ద‌రు అమ్మ రాజ‌శేఖ‌ర్‌, సుజాత‌. ముందుగా మాస్ట‌ర్ గురించి చెప్పాలంటే ప్ర‌తిదానికి త‌ను పెద్ద‌వాడిన‌ని అంద‌రిపై జులుం ప్ర‌ద‌ర్శిస్తాడు. అత‌నికి వ్య‌తిరేకంగా మాట్లాడినా, నామినేట్ చేసినా స‌హించ‌లేడు. ఆట‌లో భాగ‌మేన‌ని స‌ర్దుకుపోలేడు. వ్య‌క్తిగ‌తంగా తీసుకుని శాప‌నార్థాలు పెడ‌తాడు. ఇలా ఎంతోమంది మాస్ట‌ర్‌ను గురువు, డాడీ అంటూ అత‌డి చేతిలో బ‌ల‌య్యారు. త‌న కోప‌మె త‌న శ‌త్రువు అన్న వాక్యం ఇప్పుడు ఆయ‌న విష‌యంలో ప‌ని చేస్తోంది. అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌కు చిర్రెత్తుకొచ్చిన బిగ్‌బాస్ ప్రేమికులు ఆయ‌న్ను హౌస్ నుంచి పంపించేయాల‌ని ఎదురు చూస్తున్నారు. దీంతో అత‌డికి ఈ సారి త‌క్కువ ఓట్లే వ‌చ్చాయి.

సుజాత‌పై వేలాడుతున్న ఎలిమినేష‌న్ క‌త్తి
సుజాత‌కు న‌వ్వు ప్ల‌స్సా? మైన‌స్సా? అన్నది ప్ర‌శ్నార్థ‌కంగా మార‌నుంది. ఎందుకంటే ఆమె న‌వ్వితే బాగుంటుంద‌ని స్వ‌యంగా నాగార్జునే చెప్పారు. దీంతో అంద‌ల‌మెక్కి కూర్చున్న ఆమె న‌వ్వ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంది. ఇది చూసిన‌ ప్రేక్ష‌కులు ఆమెకెవ‌రైనా న‌వ్వ‌డం ఆప‌మ‌ని చెప్పండ్రా బాబూ అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అంతా ఫేక్ న‌వ్వు అని విమ‌ర్శిస్తున్నారు. ఇది కాసేపు ప‌క్క‌న పెడితే అంద‌రిదీ ఒక రూటైతే ఆమెది సెప‌రేటు రూటు. నాగ్‌ను అంద‌రూ స‌ర్ అని పిలిస్తే సుజాత మాత్రం బిట్టూ అని హొయ‌లు పోతుంది. అలా పిలిపించుకోవ‌డం నాగ్‌కు ఎలా ఉన్నా ఆయ‌న అభిమానుల‌కు మాత్రం ఒళ్లు మండిపోతోంది. పైగా గాసిప్స్ రాణి కూడా అయిన ఈ సుజాత‌ను ఈ వారం ముల్లెమూట స‌ర్దుకుని నేరుగా ఇంటికి పంపించాల‌ని వీక్ష‌కులు నిర్ణ‌యించుకున్నారు. 

ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ఓట్ల ప్ర‌కారం సుజాత‌కే అత్యంత త‌క్కువ ఓట్లు వ‌చ్చాయి. స్వ‌ల్ప ఓట్ల తేడాతో అమ్మ రాజ‌శేఖ‌ర్ త‌ర్వాతి స్థానంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కానీ ఓటింగ్‌కు ఈ రోజు అర్ధ‌రాత్రి వ‌ర‌కు స‌మ‌యం ఉండ‌టంతో ఈ స్థానాలు త‌ల‌కిందుల‌వుతాయో, అలాగే ఉండిపోతాయో చూడాలి!

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top