బిగ్‌బాస్‌: రీ ఎంట్రీ కోసం‌ స్వాతి ఫ్యాన్స్ ఆందోళ‌న‌

Bigg Boss 4 Telugu: Swathi Deekshith Fans Protest At Annapurna Studios - Sakshi

బిగ్‌బాస్‌లోకి స్వాతిని మ‌ళ్లీ తీసుకోవాలని డిమాండ్‌

సాక్షి, హైద‌రాబాద్‌: ఆమె బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నంత‌వ‌ర‌కూ ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. కానీ ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడ‌టం మొద‌లు పెట్టాక ఆమె చెప్పే పాయింట్లు, మాట తీరు అంద‌రినీ అబ్బు‌రప‌రుస్తున్నాయి. ఆమె మ‌రెవ‌రో కాదు, గ‌త‌వారం ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్‌. మూడో వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా హౌస్‌లో అడుగుపెట్టి అంద‌రినీ క‌లుపుకునేందుకు ప్ర‌యత్నిస్తున్న క్ర‌మంలోనే హ‌ఠాత్తుగా ఎలిమినేష‌న్ బాంబును ఆమె నెత్తిన వేశారు. దీంతో షాకైన స్వాతి బ‌య‌టకు వ‌చ్చాక ఒక్కో ఎపిసోడ్ చూసి ఇంకా నిశ్చేష్టురాలైంది. త‌ను చేసిన‌దానిలో 10 శాతం మాత్ర‌మే చూపించార‌ని వాపోయింది. అభిమాన న‌టి బిగ్‌బాస్ షోకు మెరుపుతీగ‌లా వెళ్లి రావ‌డాన్ని అభిమానులు జీర్ణించుకోలేక‌పోయారు. ఆమె హౌస్‌కు మ‌ళ్లీ వెళ్లాల్సిందేనంటూ పోరాడుతున్నారు. (హారిక ఫోక‌స్ అంతా అభిజిత్‌పైనే ఉంది)

ఎలిమినేష‌న్ బిగ్‌బాస్ టీమ్ చేతిలో ఉంది
ఈ నేప‌థ్యంలో స్వాతి దీక్షిత్ అభిమానులు అన్న‌పూర్ణ స్టూడియో ఎదుట బుధ‌వారం ఆందోళ‌న చేప‌ట్టారు. స్వాతి దీక్షిత్ చేసినవాటిని ఎందుకు టెలికాస్ట్ చేయ‌లేద‌ని నిల‌దీశారు. ఆమెను రీ ఎంట్రీ ద్వారా మ‌ళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు. ఈ ఎలిమినేష‌న్ చూస్తోంటే ప్ర‌తివారం ఎవ‌రెవ‌రిని ఎలిమినేట్ చేయాల‌నేది బిగ్‌బాస్ టీమ్ ముందుగానే డిసైడ్ అయిపోయిన‌ట్లు క‌నిపిస్తోంద‌ని విమ‌ర్శిస్తున్నారు. ఓటింగ్‌లోనూ చివ‌రి నుంచి రెండో స్థానంలో ఉన్న స్వాతిని కావాల‌నే పంపించేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రేక్ష‌కుల చేతిలోనే ఎలిమినేష‌న్ ఉంద‌ని నాగ్ అంటున్నారు. కానీ అలా జ‌ర‌గ‌డం లేదని, అందుకే బిగ్‌బాస్ న‌చ్చ‌డం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. "ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేష‌న్‌, స్వాతి దీక్షిత్‌ను తిరిగి తీసుకురండి" అని ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. (మాస్ట‌ర్‌పై ప్ర‌తీకారం తీర్చుకున్న స్వాతి దీక్షిత్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top