న‌న్ను పంపించేయండి: చేతులెత్తి వేడుకున్న గంగ‌వ్వ‌

Bigg Boss 4 Telugu: Gangavva Request Nag To Send Her Back To Home - Sakshi

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో చాలామంది కంటెస్టెంట్లు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా తెలీదు. కానీ ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో నుంచి వ‌చ్చిన గంగ‌వ్వ అంద‌రికీ సుప‌రిచితురాలే. ఇల్లు క‌ట్టుకోవాల‌న్న ఆశ‌తో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. కానీ ఎప్పుడూ న‌లుగురి మ‌ధ్య తిరుగుతూ ఉండే ఆమె నాలుగు గోడ‌ల మ‌ధ్య ఉండలేక‌పోయింది. ఫేక్ ఎమోష‌న్స్ చూపించే మ‌నుషుల మ‌ధ్య ఇమ‌డ‌లేపోయింది. మ‌ట్టి వాస‌న‌ను పీల్చి బ‌తికే ఆమెకు ఏసీ వాస‌న ప‌డ‌లేదు. అంద‌రితో క‌లిసి నాలుగు మాట‌లు చెప్తూ బువ్వ తినే అవ్వకు అక్క‌డ బుక్కెడు అన్నం కూడా గొంతులోకి దిగ‌ట్లేదు. అనారోగ్యంగా ఉన్న‌ప్ప‌టికీ ఇంకో రెండు వారాలుండేందుకు ప్ర‌య‌త్నిస్తానంటూ నెల‌ రోజులుగా కాలం నెట్టుకొచ్చింది.

అవ్వ ఆరోగ్య స్థితిపై చ‌లించిన నాగ్‌
కానీ రోజురోజుకీ ఆమె ప‌రిస్థితి దిగ‌జారుతోంది. వారం రోజులుగా ఆమె ఆరోగ్యం ఏమీ బాగో లేదని స్వ‌యంగా నాగార్జున ప్ర‌క‌టించారు. ఆమె హెల్త్ రిపోర్టులు చూసి చ‌లించిపోయిన నాగ్ ఆమె వెళ్లిపోయేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని బిగ్‌బాస్‌ను కోరారు. క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి వెళ్లిన గంగ‌వ్వ నాగ్‌తో మాట్లాడుతూ.. "ఇంకో రెండు వారాలుంటే బాగుండు. కానీ, నాకు గుండె త‌ట్టుకుంట‌ లేదు" అంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది. త‌నను ఇంటికి పంపించేయండ‌ని చేతులెత్తి వేడుకుంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: వెళ్లిపోయేది ఆమె? అత‌డు?)

ఆమెకు ఇల్లు క‌ట్టించండి
అవ్వ ప‌రిస్థితిని అర్థం చేసుకున్న నాగ్ ఆమెను బ‌య‌ట‌కు పంపించేయాల‌ని బిగ్‌బాస్‌ను కోరారు. దీంతో అవ్వ ఇక హౌస్‌లో ఉండ‌ద‌న్న విష‌యం జీర్ణించుకోలేక‌పోయిన అఖిల్‌, సుజాత కంట‌త‌డి పెట్టుకున్నారు. ఈ ప్రోమో చూసిన నెటిజ‌న్లు అవ్వ‌కు మంచి ఇల్లు క‌ట్టించ‌మ‌ని, లేదంటే ఇల్లు క‌ట్టేందుకు అవ‌స‌ర‌మ‌య్యేంత పారితోషికాన్ని ఆమెకు అప్ప‌జెప్పండ‌ని వేడుకుంటున్నారు. "నువ్వు ఉన్నావ‌న్న ఒకే ఒక్క కార‌ణంతో బిగ్‌బాస్ చూస్తున్నాం. ఇప్పుడు నువ్వెళ్లిపోయాక ఎవ‌రి కోసం ఈ షో చూడాలి?" అని ఆమె అభిమానులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. (చ‌ద‌వండి: బిడ్డ శ‌వం ఎత్తుకుని వెళ్తే బ‌స్సెక్క‌నియ్య‌లే: గంగ‌వ్వ‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top