ఎలిమినేష‌న్: అత‌డు కాదు ఆమె!

Bigg Boss 4 Telugu; Devi Nagavalli Will Evicted In 3rd Week - Sakshi

బిగ్‌బాస్‌లో గ‌త రెండు సీజ‌న్ల నుంచీ ఓ సాంప్ర‌దాయం న‌డుస్తూ వ‌స్తోంది. షో ప్రారంభానికి ముందే కంటెస్టెంట్ల లిస్ట్‌ను లీక్ చేయ‌డం, ఇక‌ ఎపిసోడ్ ప్రారంభానికి ముందు ఎవ‌రెవ‌రు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు? ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు? అ‌నే విష‌యాల‌ను కూడా లీకువీరులు సోష‌ల్ మీడియాలో ముందుగానే ట‌ముకేసి మ‌రీ చెప్పేస్తున్నారు. దీంతో అస‌లు ఎపిసోడ్‌కు వ‌చ్చేసరికి అంతా ఊహించిన‌ట్టే జ‌రుగుతుండ‌టంతో అస‌లు మ‌జా పోతోంది. దీన్ని అరిక‌ట్ట‌డం బిగ్‌బాస్ టీమ్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఎప్ప‌టిలాగే ఈ సీజ‌న్‌లోనూ లీకువీరులు చెప్పినట్టుగానే జ‌రుగుతోంది. వాళ్లు ఊహించిన‌ట్లుగానే మూడు వారాల్లోపే ముగ్గురు కంటెస్టెంట్లు కుమార్ సాయి, ముక్కు అవినాష్‌, స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే సూర్య కిర‌ణ్‌, క‌రాటే క‌ల్యాణి ఎలిమినేట్ అవుతార‌ని చెప్పిన జోస్యం కూడా నిజ‌మైంది.

అరియానాపై బిగ్‌బాంబ్‌
కానీ మూడో వారానికి వ‌చ్చేసరికి మాత్రం అస‌లుకే ఎస‌రొచ్చింది. కండ‌ల వీరుడు మెహ‌బూబ్ బిగ్‌బాస్‌కు గుడ్‌బై చెప్ప‌బోతున్నాడ‌ని లీకువీరులు ప్ర‌క‌టించేశారు. కానీ క‌థ అడ్డం తిరిగింది. అత‌డు సేఫ్ జోన్‌లో అడుగు పెట్ట‌గా, దేవి నాగ‌వ‌ల్లి ఎలిమినేట్ అవ‌నుంద‌ని తాజా స‌మాచారం.  ఇదంతా లీకువీరుల ఆట క‌ట్టించ‌డానికి బిగ్‌బాస్ వేసిన ఎత్తుగ‌డ‌లా క‌నిపిస్తోంది. ఇక దేవి నాగ‌వ‌ల్లి, మెహ‌బూబ్‌కు మ‌ధ్య స్వ‌ల్ప ఓట్ల తేడా మాత్ర‌మే ఉంద‌ట‌. ఇదిలా వుంటే లేడీ బిగ్‌బాస్ అవుతాన‌ని వ‌చ్చిన దేవి త‌న బాధ్య‌త‌ను అరియానా భుజాలపై వేసిందట‌. బిగ్‌బాంబ్ ద్వారా అరియానాను వ‌చ్చే వారం నామినేష‌న్ గండం నుంచి గ‌ట్టెక్కించింద‌ని గుసగుస‌లు వినిపిస్తున్నాయి. (మ‌హాన‌టి గంగ‌వ్వ‌, మహా కంత్రి అవినాష్‌)

దేవిని ఎలిమినేట్ చేస్తే బిగ్‌బాస్ చూడం
ఈ వార్త విని దేవి అభిమానులు బిగ్‌బాస్ యాజ‌మాన్యంపై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దేవి ఎలిమినేట్ అయితే ఈ సీజ‌న్ ఇంక ఎందుకూ ప‌నికిరాద‌ని తిట్టిపోస్తున్నారు. ఆమె లేక‌పోతే షో చూడ‌ట‌మే వేస్ట్ అని మండిప‌డుతున్నారు. బ‌ల‌మైన కంటెస్టెంటును ఇంటి నుంచి పంపించే‌సి పెద్ద త‌ప్పు చేస్తున్నార‌ని హెచ్చ‌రిస్తున్నారు. పులిహోర క‌లిపే వాళ్ల‌ను హౌస్‌లో ఉంచి ఇలాంటి మంచి కంటెస్టెంట్ల‌ను పంపివేయ‌డం భావ్యం కాద‌ని ప‌లువురు నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. (బిగ్‌బాస్ షోలో సంద‌డి చేయ‌నున్న‌ అనుష్క‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

27-11-2020
Nov 27, 2020, 22:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో‘ రేస్ టు ఫినాలే’ బెల్స్‌ మోగాయి. దీంతో మరోసారి ఇంటి సభ్యుల మధ్య మాట యుద్ధం మొదలైంది....
27-11-2020
Nov 27, 2020, 18:35 IST
టెలివిజన్‌ బిగ్‌ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’కు లభించిన ఆదరణ మరే ఇతర షోలకు లభించదనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో గత...
26-11-2020
Nov 26, 2020, 23:24 IST
నిన్నటి ఎపిసోడ్‌లో దెయ్యం మాటల్ని లెక్క చేయలేదు ఇంటి సభ్యులు. పైగా దెయ్యంపైనే జోకులు వేస్తూ పగలబడి నవ్వారు. దీంతో...
26-11-2020
Nov 26, 2020, 20:16 IST
బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ బిగ్‌ రియాల్టీ షోకు శుభం కార్డు పడటానికి మరో నాలుగు...
26-11-2020
Nov 26, 2020, 17:09 IST
బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. షో ముగింపునకు మరో 24 రోజులు మాత్రమే ఉండటంతో మిగిలిన ఎపిసోడ్స్‌ని...
26-11-2020
Nov 26, 2020, 16:14 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో నిన్నటి దెయ్యం ఎపిసోడ్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది. హౌస్‌మేట్స్‌ని భయపెట్టడంతో దెయ్యం విఫలమైంది. అరియానా మొదట్లో కాస్త భయపడినా.....
25-11-2020
Nov 25, 2020, 22:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి దెయ్యం వచ్చింది. వింత వింత శబ్దాలు చేస్తూ ఇంటి సభ్యులను భయపెట్టే ప్రయత్నం చేసింది.అంతటితో ఆగకుండా హౌస్‌మేట్స్‌...
25-11-2020
Nov 25, 2020, 16:50 IST
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపుదశకు వచ్చింది. ఊహించని ట్విస్టులు, సరికొత్త టాస్క్‌లతో గత సీజన్ల...
25-11-2020
Nov 25, 2020, 15:52 IST
తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్ ముంగింపు దశకు వచ్చింది.
24-11-2020
Nov 24, 2020, 22:48 IST
ఇప్ప‌టి నుంచి హారిక‌ను జీవితంలో మ‌ర్చిపోలేను, ఆమెను అమ్మ అని పిలుస్తా..
24-11-2020
Nov 24, 2020, 16:45 IST
ఆదివారం వ‌ర‌కు స్నేహ‌గీతాలు పాడుకునే కంటెస్టెంట్లు సోమ‌వారం నాడు మాత్రం ఏదో పూన‌కం వ‌చ్చిన‌ట్లుగా శివాలెత్తుతారు. నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఒక‌రి మీద...
24-11-2020
Nov 24, 2020, 15:27 IST
ప‌న్నెండో వారానికి గానూ జ‌రిగిన నామినేష‌న్స్‌తో బిగ్‌బాస్ హౌస్ క‌కావిక‌లం అయింది. ఒక‌ర్ని విడిచి ఒక‌రం ఉండ‌లేం అన్న‌ట్లుగా ఉండే జంట...
23-11-2020
Nov 23, 2020, 23:24 IST
పోయిన‌సారి నామినేష‌న్ అఖిల్‌, అభిజిత్ మ‌ధ్య చిచ్చు పెడితే ఈసారి మాత్రం అఖిల్ మోనాల్ మ‌ధ్య అగాధాన్ని సృష్టించింది. ఇద్ద‌రి...
23-11-2020
Nov 23, 2020, 20:17 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప్రారంభానికి ముందు నుంచే ఈ షోకు లీకుల బెడ‌ద ప్రారంభ‌మైంది. సీజ‌న్ ప్రీమియ‌ర్ ఎపిసోడ్‌కు ముందే ఎవ‌రెవ‌రు...
23-11-2020
Nov 23, 2020, 19:18 IST
బిగ్‌బాస్ ప్ర‌యాణం ముగింపుకు వ‌చ్చే కొద్దీ ఇంట్లో లెక్క‌లు మారుతున్నాయి. ముఖ్యంగా సీక్రెట్ రూమ్ ఘ‌ట్టం నుంచి అఖిల్ గ్రాఫ్...
23-11-2020
Nov 23, 2020, 18:04 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప‌న్నెండో వారంలోకి అడుగు పెట్టింది. ప్ర‌స్తుతం హౌస్‌లోఏడుగురు కంటెస్టెంట్లు మాత్ర‌మే మిగిలారు. రోజులు త‌గ్గేకొద్దీ వారి...
22-11-2020
Nov 22, 2020, 23:15 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప‌ద‌కొండో వారంలో లాస్య జున్నును క‌లిసేందుకు ఇంటికి వెళ్లిపోయింది. అస‌లే లాస్య ఇల్లు విడిచి 70 రోజులు...
22-11-2020
Nov 22, 2020, 18:03 IST
బిగ్‌బాస్ ఇచ్చే టాస్కులు ఒక‌త్తైతే అంద‌రికీ వండి పెట్ట‌డమ‌నేది మ‌రో ఎత్తు. మొద‌టి విష‌యాన్ని ప‌క్క‌న పెడితే బిగ్‌బాస్ హౌస్‌లో...
22-11-2020
Nov 22, 2020, 16:50 IST
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన రియాలిటీ షోగా‌ బిగ్‌బాస్ త‌న పేరు లిఖించుకుంది. ఏ యేటికాయేడు రెట్టింపు ఉత్సాహంతో...
22-11-2020
Nov 22, 2020, 15:54 IST
నిన్న ఫ్యామిలీ ఎపిసోడ్‌తో కంటెస్టెంట్ల‌ను హుషారెత్తించిన నాగ్ నేడు వారితో గేమ్స్ ఆడించేందుకు రెడీ అయ్యారు. ఇంటిస‌భ్యులు సైతం రెట్టింపు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top