బిగ్‌బాస్‌: అదిరేటి డ్రెస్‌ మేమేస్తే.. | Bigg Boss 4 Telugu: Contestants Superb Ramp Walk At Fashion Show | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: అద్దంలా మారిన అవినాష్‌.. అయ్య బాబోయ్‌

Oct 2 2020 5:37 PM | Updated on Oct 2 2020 8:09 PM

Bigg Boss 4 Telugu: Contestants Superb Ramp Walk At Fashion Show - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో కావాల్సినంత వినోదం అందుతోంది. ఆటలు, పాటలు, టాస్క్‌లతోపాటు హౌజ్‌లో అందానికి కూడా కొదవేలేదు. ఈ సీజన్‌లో గంగవ్వ మినహా ప్రస్తుతం ఉన్న అమ్మాయిలంతా దాదాపు యంగ్‌ వారే కావడంతో కంటెస్టెంట్ల మధ్య బోలెడంత లవ్‌ట్రాక్‌లు నడుస్తున్నాయి. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త టాస్క్‌లు,స్కిట్‌లతో బిగ్‌బాస్‌ ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా బిగ్‌బాస్‌ ప్రతి సీజన్‌లోనూ ఓ ఎపిసోడ్‌ను ఫ్యాషన్‌ షోకు కేటాయించే సంప్రదాయం కొనసాగుతోంది. అలాగే ఈ సీజన్‌లో కూడా నేడు బిగ్‌బాస్‌ హౌజ్‌లో ష్యాషన్‌ షో జరగనుంది. చదవండి: అఖిల్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్న బిగ్‌బాస్

అయితే ఈ ఫ్యాషన్‌ షోలో ఇంటి సభ్యులందరూ సంప్రదాయమైన దుస్తులను ధరించాల్సి ఉంటుంది. దీంతో కంటెస్టెంట్లందరూ తమ ట్రెడీషనల్‌ లుక్‌లో జిగేలు మనిపించారు. అబ్బాయిలంతా కుర్తా దుస్తుల్లో స్టేజ్‌పై ర్యాంప్‌ వాక్‌తో అదరగొట్టగా..ఇక అమ్మాయిలయితే తమ అందచందాలతో మైమరిస్తూ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. చీర కట్టుతో పదహారణాల తెలుగింటి అమ్మాయిలాగా మెరిసిపోతున్నారు. అంతేగాక బిగ్‌బాస్‌ గ్యాంగ్‌ అంతా స్టేజ్‌ మీదకు వచ్చి డాన్స్‌లతో కెవ్వు మనిపించనున్నారు. ఆ తర్వాత అవినాష్‌ ఇంట్లోని ఆడవాళ్లకు అద్దంలా మారబోతున్నాడు. తన ముందుకు వచ్చిన అమ్మాయిలతో అద్దంగా మారిన అవినాష్‌ వారిపై సరదాగా సెటైర్లు వేస్తూ హాస్యం పండించనున్నారు. చదవండి: బిగ్‌బాస్‌: మాస్టర్‌ కాళ్లు పట్టుకున్న సోహైల్‌

Advertisement
 
Advertisement
Advertisement