ఇక్కడ రిలేష‌న్స్ పెట్టుకోవ‌డం వేస్ట్‌: అఖిల్‌

Bigg Boss 4 Telugu: Akhil Sarthak Feeling Lonely In Bigg Boss House - Sakshi

బిగ్‌బాస్ అన్‌సీన్‌లో బాధ‌ను వెల్ల‌గ‌క్కిన అఖిల్‌

బిగ్‌బాస్ హౌస్‌లో ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ న‌డుపుదామ‌నుకున్నారు. కానీ అది వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. అభిజిత్ మోనాల్‌ను ప‌క్క‌న పెట్టి హారిక‌తోనే ఉంటున్నాడు. అయితే నామినేష‌న్ ప్ర‌క్రియ పెట్టిన చిచ్చు వ‌ల్ల ఈక్వేష‌న్స్ త‌ల‌కిందుల‌య్యాయి. నేష‌న‌ల్ ఛానెల్‌లో త‌న గురించి మాట్లాడ‌కండి అని మోనాల్‌.. అఖిల్‌, అభిజిత్‌కు వార్నింగ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అప్ప‌టినుంచి అఖిల్ ఆమెతో మాట్లాడ‌ట‌మే మానేశాడు. కానీ ఇదే స‌మ‌యంలో అభి.. మ‌ళ్లీ ఆమెకు ద‌గ్గ‌ర‌వుతున్నాడు. వీళ్లిద్ద‌రూ మ‌న‌సు విప్పి మాట్లాడుకుంటున్నారు.

నాకు ఇంట్లో బాగా న‌చ్చే వ్య‌క్తి అఖిల్‌: మోనాల్‌
అఖిల్ మాత్రం ఒంట‌రివాడైపోయాడు. అత‌డితో మాట్లాడేందుకు మోనాల్ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేయ‌గా చివ‌రికి ఆయ‌న ఏదో పొడిపొడిగా మాట్లాడాడు. కానీ నీపై న‌మ్మ‌కం పోయిందంటూ మోనాల్ ముఖం మీదే చెప్పాడు. నేను నీకు న‌చ్చ‌డం లేదా అని మోనాల్ విసిరిన ప్ర‌శ్న‌కు సైతం ఏ విష‌యంలో? ఎందుకు న‌చ్చాల‌ని అని ఎదురు ప్ర‌శ్నించాడు. త‌న‌కు మాత్రం ఇంట్లో బాగా న‌చ్చే వ్య‌క్తి అఖిల్ అని చెప్ప‌గా అవునా! నీకు నేనంటే ఇష్ట‌మా? అని కొంత ఆశ్చ‌ర్యంగా, మ‌రికొంత నిస్తేజంగా ముఖం పెట్టాడు. ఆ త‌ర్వాత త‌న‌లో త‌ను న‌లిగిపోతున్న విష‌యాల‌ను ఏక‌రువు పెట్టాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అఖిల్ మీద ప‌డిపోయిన సోహైల్‌)

గంగ‌వ్వ ప్రేమ‌కు దూరం కానున్న అఖిల్‌
"బిగ్‌బాస్ ఇంట్లో నాకు ఎవ‌రూ లేరు. నాకు స‌పోర్ట్ ఇచ్చేవాళ్లు క‌నిపించ‌లేదు. గంగ‌వ్వ త‌ప్ప‌! సోహైల్ సోద‌రుడిలా అనిపిస్తాడు. మెహ‌బూబ్ ఫ్రెండ్‌. అయినా ఇక్క‌డ రిలేష‌న్‌షిప్స్ పెట్టుకోవ‌డమే వేస్ట్‌. నువ్వే న‌న్ను ఇలా చేశావు ఇలా చేశావు అని నిల‌దీస్తున్నావు. అలాంట‌ప్పుడు ఇక‌ ఎవ‌రితో కూడా రిలేష‌న్స్ పెట్టుకోవ‌ద్ద‌ని అనుకుంటున్నాను" అని మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టాడు. కాగా అత‌నికి అండ‌గా ఉంటూ ఆప్యాయంగా చూసుకునే గంగ‌వ్వ నేడు బిగ్‌బాస్ హౌస్ నుంచి వెళ్లిపోనుంది. దీంతో అవ్వ‌ను ఆరాధించే అఖిల్‌ ప‌రిస్థితి మ‌రింత ఘోరంగా త‌యార‌వనుంది. ఇప్ప‌టికే మోనాల్ విష‌యంలో మ‌థ‌న ప‌డుతున్న ఆయ‌న‌ టాస్కులోనూ స‌రిగా ఆడ‌లేక‌పోతున్నాడ‌ని మెహ‌బూబ్‌, సోహైల్ ముచ్చ‌ట్లు పెట్టుకున్నారు. ఇలాంటి స‌మ‌యంలో అవ్వ వెళ్లిపోతే అఖిల్ ఆ బాధ నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాడో చూడాలి! (చ‌ద‌వండి: బిగ్‌బాస్: ఆ విషయంలో మోనాల్‌దే తప్పన్న దివి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top