బిగ్‌బాస్: ఆ విషయం మోనాల్‌దే తప్పన్న దివి

Bigg Boss 4 Telugu: Divi Comments On Triangle Love Story - Sakshi

బిగ్‌ బాస్హౌస్‌లో మోనాల్‌, అభిజిత్‌, అఖిల్‌ మధ్య రొమాంటిక్‌ ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ నడుస్తున్న విషయం తెలిసిందే. అలకలు, కోపాలు, గొడవలు, హగ్‌లు ఇవన్నీ ఈ ముగ్గురి మధ్యే ఎక్కువగా జరుగుతున్నాయి. గత రెండు రోజులుగా మోనాల్‌కు కాస్త దూరంగా ఉంటూ వస్తోన్నాడు అఖిల్‌. ఈ గ్యాప్‌లో అభిజిత్‌ మోనాల్‌కు దగ్గరయ్యాడు. దీంతో అఖిల్‌ మళ్లీ మోనాల్‌తో మాట్లాడటం స్టార్ట్‌ చేశాడు. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో మోనాల్‌, అఖిల్‌ మళ్లీ మాట్లాడుకున్నారు. దీంతో హౌస్‌లో మళ్లీ ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ చర్చకు వచ్చింది. ఈసారి ఏకంగా మోనాల్‌ వద్దే ఈ విషయాన్ని ప్రస్తావించింది దివి. ‘మీ ముగ్గురి మధ్య ఏం జరుగుతుందో తెలీదు కానీ.. అఖిల్‌, అభి ఇద్దరూ మోనాల్‌కి నేనంటే ఇష్టం అనుకుంటున్నారు. నామినేషన్ అప్పుడు ఏమైందని కాదు. కానీ అంతకు ముందు కూడా ఇది ఉంది. ఇద్దరూ జన్యున్‌గా ఉంటున్నారు. నువ్వు ఇద్దరితో ‌మాట్లాడి, ఇద్దరి మైండ్‌లో నువ్వంటే ఇష్టం అని క్రియేట్ చేయడం నీ తప్పు’ అని మోనాల్‌ ముఖం మీదే చెప్పేసింది. 
(చదవండి : ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నా: అవినాష్‌)

దానికి స్పందించిన మోనాల్‌.. ‘నేను ఇద్దరినీ లైక్ చేస్తున్నా. కానీ పేరును వాడటం ఇష్టం లేదు. మా మధ్య ఏం జరగలేదు. చిన్న మ్యాటర్‌ని పెద్దదిగా చేస్తున్నారు’ అంతే అని  క్లారిటీ ఇచ్చింది. అయితే మధ్యలో కలగజేసుకున్న అమ్మ రాజశేఖర్‌.. అఖిల్‌తో ఉంటే ఏం కాదు కానీ, అభిజిత్‌తో ఉండొద్ద‌ని ఉచిత స‌ల‌హా ఇవ్వబోగా, ఇద్ద‌రూ జెన్యూన్‌, నువ్వే వాళ్ల‌కు క్లారిటీ ఇవ్వు అని మోనాల్‌కి దివి సలహా ఇచ్చింది.

ఇది ఇలా ఉంటే రెండు రోజుల తర్వాత మాట్లాడుకుంటున్న అఖిల్‌, మోనాల్‌.. మళ్లీ ఎప్పటిలాగే గుసగుసలాడటం మొదలుపెట్టారు. ఒకరి బాధలు ఒకరు షేర్‌ చేసుకున్నారు ‘గత వారం లగ్జరీ బడ్జెట్ షాపింగ్ సరిగా చేయలేదని చాలా మంది నన్ను నామినేట్ చేశారు. కానీ ఇప్పుడు అందరూ నేను షాపింగ్ చేసిన వాటినే తింటున్నారు’అఖిల్ బాధపడగా.. మోనాల్‌ ఓదార్చింది. ఈ క్రమంలో దేవుడిపై నాకు చాలా నమ్మకం అని అఖిల్ అన్నాడు. అప్పుడు మోనాల్‌.. మరి నాపై లేదా? అని అడగ్గా.. నీపై జీరో పర్సంట్ కూడా లేదని అఖిల్ డైరెక్ట్‌గా చెప్పేశాడు. దీంతో మోనాల్ కాస్త చిన్నబుచ్చుకుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top