బిగ్‌బాస్‌ : మోనాల్‌కి అభి భరోసా.. మాటపై నిలబడేనా! | Bigg Boss 4 Telugu :Abhijeet Promise To Monal | Sakshi
Sakshi News home page

నాగ్‌ ముందే మోనాల్‌కి అభి భరోసా.. మాటపై నిలబడేనా!

Nov 2 2020 6:31 PM | Updated on Nov 2 2020 8:37 PM

Bigg Boss 4 Telugu :Abhijeet Promise To Monal - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆదివారం కొన్ని ఊహించని ట్విస్టులు జరిగాయి. ఎలిమినేట్‌ అవుతాడనుకున్న అమ్మ రాజశేఖర్‌ సేవ్‌ అవ్వడమే కాకుండా ఈ వారం కెప్టెన్సీ పోటీ దారునిగా నేరుగా ఎంపికయ్యాడు.  మోనాల్‌ నామినేట్‌ చేసిన అభిజిత్‌ చేతే ఆమెను సేవ్‌ చేయించాడు. ఈ సందర్భంగా హోస్ట్‌ నాగార్జున సాక్షిగా మోనాల్‌కు అభిజిత్‌ ఓ ప్రామిస్‌ ఇచ్చాడు. ఇకపై తనను నామినేట్‌ చేయబోనని ప్రకటించాడు. గత వారం ఎలిమినేట్ అయిన వారిలో ఒక్కొక్కరిని నాగార్జున సేవ్ చేసుకుంటూ వస్తోన్న తరుణంలో అభిజిత్‌కి ఒక అవకాశం ఇచ్చారు. బుట్టలో కొన్ని ఆపిల్స్‌ని తీసుకొచ్చి అభిజిత్‌తో కట్‌ చేయించారు.

ఆపిల్స్‌ని కట్‌ చేస్తే.. అందులో ఎవరి ఫోటో​ వస్తుందో వారి సేవ్‌ అవుతారని నాగార్జున తెలిపారు. దీంతో అభిజిత్‌ ఆపిల్స్‌ని కోయడం మొదలు పెట్టారు. రెండో ఆపిల్‌ కట్‌ చేయగానే.. మోనాల్ ఫొటో రాగా ఆమె సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. ఈ సందర్భంగా అభి, మోనాల్‌కి ఒక భరోసా ఇచ్చారు. ఇకపై మోనాల్‌ని నామినేట్‌ చేయనని అభి ప్రకటించారు. కాగా, మోనాల్‌తో అభిజిత్‌కి విభేధాలు ఉన్నప్పటికీ గత వారం మినహా ఒక్కసారి కూడా ఆమెను నామినేట్‌ చేయలేదు. గతవారం తప్పనిసరి పరిస్థితుల్లో మోనాల్‌ని నామినేట్‌ చేశాడు. బలమైన రీజన్‌ ఉంటేనే ఎలిమినేషన్‌కి నామినేట్‌ చేయాలని అభి వాదన. మరి మోనాల్‌కి ఇచ్చిన మాటను అభి నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. 

Advertisement
 
Advertisement
Advertisement