బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్.. ఒకేసారి ఐదుగురు ఎలిమినేట్!! | Bigg Boss 17 might see shocking eliminations this week | Sakshi
Sakshi News home page

Bigg Boss: బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్.. ఒకేసారి ఐదుగురు ఎలిమినేట్!

Nov 20 2023 4:15 PM | Updated on Nov 20 2023 4:35 PM

Bigg Boss 17 might see five eliminations this week Shocking - Sakshi

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం అన్ని భాషల్లో అభిమానులను అలరిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అత్యధికంగా బిగ్ బాస్ సీజన్- 17 నడుస్తోంది. ఈ రియాలిటీ షోకు హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వారంలో కంటెస్టెంట్స్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు బిగ్‌ బాస్ రెడీ అయిపోయాడు. ఈ వారంలో ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్స్‌ను ఎలిమినేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. 

అయితే గత రెండు వారాలుగా ఎవరినీ ఎలిమినేట్ చేయని బిగ్ బాస్.. ఈసారి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఓకేసారి ఐదుగురిని ఎలిమినేట్ చేసి.. మరో ఐదుగురి కొత్తవారిని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి పంపించనున్నట్లు తెలుస్తోంది.  కొత్త ప్రోమోలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన వారిలో నీల్ భట్, నవిద్ సోలే, రింకు ధావన్, అభిషేక్ కుమార్, జిగ్నా వోరా ఎలిమినేట్ కానున్నట్లు ఆడియన్స్ భావిస్తున్నారు. ప్రోమో చూస్తే ఒకరిని ఒకరు వీడ్కోలు చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement