సెల్ఫీ అన్నాడు.. ఏకంగా ముద్దే పెట్టేశాడు

Bigg Boss 14 Fame Arshi Khan Shocked Airport Fan Kisses Her Video Viral - Sakshi

బిగ్‌బాస్‌ బ్యూటీకి చేదు అనుభవం

సినీ తారలకు అభిమానులు ఉండడం సహజం.  ఈ మధ్య సోషల్‌ మీడియా, బిగ్‌బాస్‌ వంటి షోల ద్వారా కూడా కొందరు సెలబ్రిటీలుగా మారుతూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. వీరు బయట కనిపిస్తే చాలు వాళ్లతో సెల్ఫీ తీసుకోవాలని, మాట్లాడాలని, కనీసం దగ్గర నుంచైనా చూడాలని తెగ తాపత్రయపడతారు. కొన్ని సందర్భాల్లో ఆ అభిమానమే ముదిరి ఆకతాయి చేష్టలుగా మారి తారలను ఇబ్బందుల్లో పడేలా చేస్తుంది. ఇటువంటి చేదు సంఘటనే బిగ్‌బాస్‌ ఫేమ్ అర్షి ఖాన్‌కు విమానాశ్రయంలో ఎదురైంది. అర్షి ఖాన్ ముంబై విమానాశ్రయంలో కనపడే సరికి అక్కడ ఓ అభిమాని ఆమెను ఒక ఫోటో కావాలని కోరాడు. అందుకు ఆమె అంగీకరించింది కూడా.

ఫొటోకు పోజిస్తుండగా సడన్‌గా అతడు ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. ఇది ఒక్కసారిగా అర్షిని షాక్‌కు గురిచేసింది. దీంతో ఆమె వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తోంది. ఇదిలా వుంటే ఈ సంఘటన జరిగిన ఒక రోజు తర్వాత అర్షి ఖాన్‌ తనకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అర్షి ఖాన్ హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లోని అత్యంత వివాదాస్పద పోటీదారులలో ఒకరు. ఆమె గతంలో బిగ్‌బాస్‌ 11వ సీజన్‌లో వికాస్ గుప్తా, శిల్పా షిండే, హీనా ఖాన్ వంటి సెలబ్రిటీలతో హౌస్‌లో తళుక్కున మెరిసింది. 

( చదవండి: ‘‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’ )

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top