బిగ్‌ స్నేక్‌ రెడీ | Big Snake King Released in India on 3rd March | Sakshi
Sakshi News home page

బిగ్‌ స్నేక్‌ రెడీ

Feb 27 2023 2:32 AM | Updated on Feb 27 2023 2:32 AM

Big Snake King Released in India on 3rd March - Sakshi

చైనాలో ఘన విజయం సాధించిన ‘బిగ్‌ స్నేక్‌ కింగ్‌’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లిక్వెన్‌ లుఓ, వాంగ్‌ జియోలాంగ్, వెంకీ జాఓ, గాఓ షెంగ్వు కీలక పాత్రల్లో గుఓ మింగర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిగ్‌ స్నేక్‌ కింగ్‌’. గత ఏడాది మే 11న చైనాలో  విడుదలైన ఈ చిత్రం మార్చి 3న ఇండియాలో విడుదల కానుంది.

బుద్ధ భగవాన్‌ పతాకంపై యేలూరు సురేంద్ర రెడ్డి తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘బిగ్‌ స్నేక్‌ కింగ్‌’ సిరీస్‌లో చైనా వాళ్లు దాదాపు 10 సినిమాలు చేశారు.. వాటిని కూడా నెలకి ఒకటి చొప్పున తెలుగులో రిలీజ్‌ చేస్తాను’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement