భూత్‌ పోలీస్‌

Bhoot Police Movie Coming Out With Combination Of Saif Ali Khan And Arjun Kapoor - Sakshi

సైఫ్‌ అలీఖాన్, అర్జున్‌ కపూర్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనుంది. ‘భూత్‌ పోలీస్‌’ అనే  టైటిల్‌తో హారర్‌ కామెడీ జానర్‌లో ఈ చిత్రం తెరకెక్కనుంది. పవన్‌ క్రిపలానీ దర్శకత్వంలో ఈ సినిమాను రమేష్‌ తౌరానీ, అక్షయ్‌ పూరీ నిర్మించనున్నారు. ఫాతిమా సనా షేక్‌ హీరోయిన్‌. ఈ సినిమాలో అర్జున్‌ కపూర్‌ దెయ్యంగా కనిపిస్తారు. సైఫ్‌ అలీను ఇబ్బందిపెడతారట. ‘‘భూత్‌ పోలీస్‌’లోని థ్రిల్స్‌ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారనుకుంటున్నాను. సైఫ్, అర్జున్‌ ఆద్యంతం నవ్విస్తారు’’ అన్నారు దర్శకుడు పవన్‌. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top