S5 No Exit: తొలి సంపాదన రూ.350.. పూరీ, చార్మీ చాలా ప్రోత్సహించారు: భరత్‌

Bharath Kommalapati, Goutham Kondepudi Talk About S5 No Exit Movie - Sakshi

తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయికుమార్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎస్‌ 5: నో ఎగ్జిట్‌’. భరత్‌ కోమలపాటి దర్శకత్వంలో ఆదూరి ప్రతాప్‌రెడ్డి, దేవు శ్యాముల్, షైక్‌ రహీమ్, గాదె మిల్కి రెడ్డి, గౌతమ్‌ కొండెపూడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజవుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఈ చిత్రదర్శకుడు భరత్‌ మాట్లాడుతూ– ‘‘మాది అనంతపురం. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ అయ్యాక హీరో అవుదామని 2003లో హైదరాబాద్‌ వచ్చాను. సినిమా ప్రారంభమైంది కానీ, ఆగిపోయింది. ఆ తర్వాత డ్యాన్సర్‌గా చాన్స్‌ వచ్చింది. తొలి సంపాదన 350 రూపాయలు. ఆ తర్వాత ‘ఆట’ షోలో పాల్గొన్నాను. కాన్సెప్ట్స్‌తో సాంగ్‌ కొరియోగ్రఫీ చేసుకుంటున్నానని తెలిసి పూరి జగన్నాథ్, చార్మీగార్లు ప్రోత్సహించారు. కొరియోగ్రాఫర్‌గా ‘జ్యోతిలక్ష్మి’ నా తొలి సినిమా. ఎన్టీఆర్‌గారి ‘టెంపర్‌’కూ చేశాను.

ఇక ‘ఎస్‌ 5: నో ఎగ్జిట్‌’ విషయానికి వస్తే...ఇందులో  సుబ్బు అనే పాత్రను తారకరత్న పోషించారు. ఆయన సీఎం సాయి కుమార్ కొడుకు. తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకునేందుకు ఓ కోచ్ ను బుక్ చేసుకుంటారు. ఇందులోని వారంతా బోగిని అలంకరించుకుని పార్టీ చేసుకుంటారు. అప్పుడు సడెన్ గా కోచ్ డోర్స్ క్లోజ్ అవుతాయి. నో ఎగ్జిట్ అన్నమాట. ఆ తర్వాత అగ్నిప్రమాదం జరుగుతుంది. అసలా అగ్నిప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఆ తర్వాత ఏమైందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కథనం ఊహకందదు. ఇందులో పొలిటికల్ డ్రామా కూడా చూపిస్తున్నాం.

తారకరత్న 45 డేస్ ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఆయన ఎక్కువగా మాట్లాడకుండా తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకునే వ్యక్తి. నాన్న చెప్పిందే చేస్తా నాకేం తెలియదు అన్నట్లు ఉంటాడు. అలాగే టీసీ పాత్రలో అలీ గారు, మరో కీ రోల్ లో సునీల్ గారి నటన ఆకట్టుకుంటుంది.మణిశర్మగారి మ్యూజిక్‌ అద్భుతంగా ఉంటుంది’అన్నారు. ‘ఈ సినిమాను 200 థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నాం. సాగా ఎంటర్‌టైన్మెంట్స్‌ రిలీజ్‌ చేస్తోంది.. ఈ చిత్రంతో మా టీమ్‌ అందరికి మంచి పేరొస్తుందని ఆశిస్తున్నాం’అని అన్నారు నిర్మాత గౌతమ్‌. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top