Actress Bhanushree Mehra Says Ageism Is Real Problem In Film Industry, Deets Inside - Sakshi
Sakshi News home page

Bhanushree Mehra: హీరోలకు ఒక రూల్‌.. హీరోయిన్స్‌కు ఒక రూలా?.. తిరగబడ్డ నటి

Mar 25 2023 10:29 AM | Updated on Mar 25 2023 10:57 AM

Bhanushree Mehra: Ageism is Real Problem In Film Industry - Sakshi

హీరోలు మాత్రం వారిలో సగం వయస్సున్న హీరోయిన్లతో లవ్‌ సీన్లలో నటిస్తుంటారు. పెళ్లైంది, వయసు పెరిగింది అని ఆడవాళ్లపై ఎందుకు పక్షపాతం చూపిస్తారు? 

వరుడు సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ ఆరంభించింది భానుశ్రీ మెహ్రా. తెలుగు, తమిళ, హిందీ, పంజాబీ భాషల్లో పలు చిత్రాలు చేసిన ఆమె హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. ఇటీవల అల్లు అర్జున్‌ తనను బ్లాక్‌ చేశాడంటూ వార్తల్లోకెక్కిన భానుశ్రీ తాజాగా మరో అంశం గురించి ట్వీట్‌ చేస్తూ వార్తల్లో నిలిచింది. 'వయసు పైబడటం అనేది సినీ ఇండస్ట్రీలో ప్రధాన సమస్యగా మారింది. హీరోయిన్లకు ఒక వయసు రాగానే వారిని తల్లి, వదిన.. అంటూ సైడ్‌ క్యారెక్టర్లకు పరిమితం చేస్తారు. కానీ ఏజ్‌ ఎక్కువున్న హీరోలు మాత్రం వారిలో సగం వయస్సున్న హీరోయిన్లతో లవ్‌ సీన్లలో నటిస్తుంటారు. పెళ్లైంది, వయసు పెరిగింది అని ఆడవాళ్లపై ఎందుకు పక్షపాతం చూపిస్తారు? ఈ మూసధోరణికి ఇకనైనా ముగింపు పలకండి. స్వతంత్రంగా జీవిస్తూ, మనోధైర్యంతో ముందడుగు వేస్తున్న మహిళల కథలను చెప్పండి' అని రాసుకొచ్చింది.

దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'తాత వయసున్న హీరోలు 25 ఏళ్ల కుర్ర హీరోయిన్లతో రొమాన్స్‌ చేస్తున్నారు, మీరు అనుకుంది జరగడం అంత ఈజీ కాదులెండి', 'మీరు చెప్పింది అక్షరాలా నిజం', 'మీరు గతంలోకన్నా ఇప్పుడే బాగున్నారు', 'మాటలు ఆపి ముందు సినిమాలు చేయండి', 'వయసుతో సంబంధం లేకుండా అనుష్క ఇప్పటికీ సినిమాలు చేస్తోంది. అయినా మీకు అదృష్టం కలిసి రాలేదు', 'చూడటానికి కూడా మీరు తల్లిలాగే కనిపిస్తున్నారు' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement