
బాలీవుడ్ నటి భాగ్యశ్రీ (Bhagyashree) ఆస్పత్రిపాలైంది. ఈ మధ్య ట్రెండింగ్‌లోకి వచ్చిన పికెల్‌బాల్ ఆడుతుండగా తలకు గాయమైంది. దీంతో ఆస్పత్రిలో చేరగా వైద్యులు ఆమె నుదురుకు 13 కుట్లు వేశారు. తలకు కట్టుతో ఉన్న భాగ్యశ్రీ ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

ఎవరీ భాగ్యశ్రీ?
అందాల తార భాగ్యశ్రీ.. ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణించింది. 1989లో మైనే ప్యార్ కియా సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇందులో సల్మాన్ ఖాన్‌తో జోడీ కట్టింది. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ మరుసటి ఏడాదే వ్యాపారవేత్త హిమాలయ్ దస్సానిని పెళ్లి చేసుకుంది.
తర్వాత కూడా పలు సినిమాలు చేసింది. త్యాగి, పాయల్, అమ్మవ్రా గంద (కన్నడ), మా సంతోషి మా, రెడ్ అలర్ట్: ద వార్ వి, ఛత్రపతి, ససాజిని షిండేకా వైరల్ వీడియో వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఓంకారం, యువరత్న రానా, రాధేశ్యామ్ సినిమాలతో మెప్పించింది. ఈమె చివరగా లైఫ్ హిల్ గయూ అనే హాట్‌స్టార్ వెబ్ సిరీస్‌లో కనిపించింది.
చదవండి: అంబానీ ఎవరో మాకు తెలీదు.. అయినా పెళ్లికి వచ్చాం: కిమ్ కర్దాషియన్
Comments
Please login to add a commentAdd a comment