పరీక్షల్లో ఫెయిల్​ అయితే.. వినోదాత్మకంగా 'బీఈ బార్​' | BE Baar Tamil Movie Shooting Wrap Up | Sakshi
Sakshi News home page

BE Baar Movie: పరీక్షల్లో ఫెయిల్​ అయితే.. వినోదాత్మకంగా 'బీఈ బార్​'

Feb 1 2022 9:06 AM | Updated on Feb 1 2022 9:48 AM

BE Baar Tamil Movie Shooting Wrap Up - Sakshi

చెన్నై సినిమా: పూర్తి వినోదభరితంగా రూపొందుతున్న తమిళ చిత్రం 'బీఈ బార్‌'. 'కావల్‌ తురై ఉంగళ్‌ నన్బన్‌' వంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని రూపొందించిన టీమ్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. 'కావల్‌ తురై ఉంగళ్‌ నన్బన్‌' మూవీ ఫేమ్‌ సురేష్‌ రవి కథానాయకుడి గానూ, 'చతురంగ వేట్టై' సినిమా ఫేమ్‌ ఇషార నాయకి గాను నటిస్తున్న ఇందులో తంబి రామయ్య, లివింగ్ట్సన్, కల్లూరి వినోద్, మధు, రేణుక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 



ఆర్‌.డీ.ఎమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శ్రీ.కె.ఎస్, ఆదిత్య అండ్‌ సూర్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను అబ్జల్యూట్‌ పిక్చర్స్‌ తరపున మాల్గమ్, బీఆర్‌ టాకీస్‌ కార్పొరేషన్, వైట్‌ మూన్‌ టాకీస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని దర్శకుడు తెలిపారు.  ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్‌ అయిన సబ్జెక్టులను క్లియర్‌  చేసుకోవడానికి పడే పాటులను వినోదభరితంగా చూపిస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement