పెళ్లి వార్తను ప్రకటించిన 'బర్రెలక్క' Barrelakka Sirisha Announced Her Marriage Details | Sakshi
Sakshi News home page

పెళ్లి వార్తను ప్రకటించిన 'బర్రెలక్క'

Published Fri, Mar 22 2024 9:12 AM

Barrelakka Sirisha Announced His Marriage Details - Sakshi

తెలంగాణ ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన పేరు బర్రెలక్క.. అసలు పేరు కర్నె శిరీష. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించింది. అందుకు సంబంధించిన పలు వీడియోల ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి.. 5,754 ఓట్లతో అక్కడ నాలుగో స్థానంలో నిలిచింది.

2022 డిసెంబరులో ఈ యువతి బర్రెలను కాస్తూ సామాజిక మాధ్యమంలో ఓ వీడియోను పోస్టు చేసింది. ఉద్యోగాలు రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో ఆమె పేరు వైరల్‌ అయింది. అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేస్తూ  రెండూ తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందింది. 

గతంలో ఆమె పెళ్లి గురించి పలు వార్తలు సోషల్‌ మీడియాలో రావడం అందుకు ఆమె రియాక్ట్‌ కావడం జరిగింది. అవన్నీ కొట్టిపారేస్తూ.. తన పెళ్లి ప్రకటన గురించి అధికారికంగా ఆమె ప్రకటించింది. తనకు నిశ్చితార్థం జరిగినట్లు బర్రెలక్క తాజాగా తెలిపింది. తన ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమం సడెన్‌గా సెట్‌ కావడంతో ఎవరినీ పిలువలేకపోయానని ఆమె చెప్పింది. పెళ్లి కోసం షాపింగ్ చేసిన వీడియోలను కూడా ఆమె పంచుకుంది. కాబోయే భర్త ఎవరో మాత్రం రివీల్ చేయలేదు. ఇటీవల బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ అవన్నీ అవాస్తవాలనీ ప్రశాంత్‌ తనకు అన్నయ్య లాంటి వ్యక్తి అని బర్రెలక్క కొట్టిపారేసింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement