''బలమెవ్వడు" మూవీ కాన్సెప్ట్ టీజర్ విడుదల | Balamevvadu Movie Concept Teaser Released | Sakshi
Sakshi News home page

''బలమెవ్వడు" మూవీ కాన్సెప్ట్ టీజర్ విడుదల

Jul 10 2021 8:51 PM | Updated on Jul 10 2021 8:51 PM

Balamevvadu Movie Concept Teaser Released - Sakshi

కార్పొరేట్ ఆస్పత్రుల ధన దాహానికి, మెడికల్ మాఫియాా మోసాలకు అద్దం పడుతూ రూపొందుతున్న సినిమా "బలమెవ్వడు". ధృవన్ కటకం ఈ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. నియా త్రిపాఠీ నాయికగా నటిస్తోంది. సత్య రాచకొండ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ఆకర్షణ కానుంది. ఆదివారం (జూలై 11) మణిశర్మ బర్త్ డే సందర్భంగా "బలమెవ్వడు" కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

ఈ కాన్సెప్ట్ టీజర్ చూస్తే...పూర్వకాలంలో వైద్యాన్ని సేవగా భావించిన పుణ్యభూమి మన దేశం. కానీ క్రమంగా వైద్యం వ్యాపారంగా మారింది. కార్పొరేట్ రూపు దాల్చింది. దీంతో వైద్యం కొనుక్కోలేక సాధారణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ నాణ్యమైన వైద్యం సామాన్యుడికి అందనంత దూరమైంది అనే వాస్తవాన్ని కాన్సెప్ట్ టీజర్ లో స్పష్టంగా చూపించారు. సుహసినీ, నాజర్, పృథ్విరాజ్‌లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సత్య రాచకొండ దర్శకుడు పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement