
‘వైవా’ హర్ష టైటిల్ రోల్‌లో, ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, ‘కేజీఎఫ్’ గరుడరామ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంతో ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లక్ష్మయ్య ఆచారి, జనార్ధన్ ఆచారి నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 8న విడుదల కానుంది.
‘‘వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందిన హంగర్ ఎంటర్‌టైనర్ సినిమా ఇది. వినోదం, థ్రిల్ అంశాలతో పాటు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి. ప్రేక్షకులకు ఓ మంచి విందు భోజనంలాంటి సినిమా’’ అని దర్శకుడు శివ పేర్కొన్నారు.