‘బ్యాచులర్‌’ హీరో కొత్త చిత్రం ప్రారంభం | Bachelor Hero Gv Prakash Kumar New Movie Shooting Starts Chennai | Sakshi
Sakshi News home page

‘బ్యాచులర్‌’ హీరో కొత్త చిత్రం ప్రారంభం

Nov 8 2022 9:23 PM | Updated on Nov 8 2022 9:32 PM

Bachelor Hero Gv Prakash Kumar New Movie Shooting Starts Chennai - Sakshi

వైవిధ్యభరితంగా కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నటుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌. ఓ పక్క సక్సెస్‌ఫుల్‌ సంగీత దర్శకుడిగా పయనాన్ని కొనసాగిస్తూ మరో పక్క కథానాయకుడిగా రాణిస్తున్నారు. ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన బ్యాచులర్‌ వంటి చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. మరిన్ని చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. కాగా తాజాగా మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రానికి సిద్ధమయ్యారు. ఈయన కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం సోమవారం చెన్నైలో పూజ కార్యక్రమం ప్రారంభమైంది.

ఇందులో ఆయనకు జంటగా మాలీవుడ్‌ బ్యూటీ అనస్వర రాజన్‌ నటిస్తున్నారు. ఇంతకుముందు తమిళంలో నటి త్రిష నాయకగా నటించిన రాంగీ చిత్రంలో ముఖ్యపాత్ర ద్వారా ఈమె పరిచయం అయింది. కాగా ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి ఉదయ్‌ మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు నాళై, చక్రవ్యూహం చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతే కాకుండా జీవా, తంగమగన్, కబాలి, వేలైక్కారన్, నేర్కొండ పార్వై తదితర చిత్రాల్లో నటుడుగా కీలకపాత్రలు పోషించారన్నది గమనార్హం. జి.వి.ప్రకాష్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న చిత్రానికి హేశం ఏడబ్ల్యూ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిస్నీ హాట్‌ స్టార్, కవితాలయ ఫిలిమ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

చదవండి: Vijay Devarakonda: ‘లైగర్‌’ ద్వారా విలువైన పాఠం నేర్చుకున్నా: విజయ్‌ దేవరకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement